Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమే - కేంద్రం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Dec 2022 04:18 PM

Background

ఉత్తర తమిళనాడు మీదుగా ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం మరింత బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీని కారణంగా తమిళనాడుతోపాటు దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. మాండౌస్ తుపాను బలహీన పడి కర్ణాటక మంగళూరు ప్రాంతం దగ్గరగా అల్పపీడనంగా...More

పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమే - కేంద్రం 

పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై  రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని కేంద్రం తెలిపింది. కానీ పలు కారణాల దృష్ట్యా ఈ గడువులోపు ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని వెల్లడించింది.