Breaking News Live Telugu Updates: రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Aug 2022 09:57 PM
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై కత్తితో దాడి

Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. దుండగుడు సల్మాన్ రష్దీపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో లెక్చర్ ఇస్తున్న రచయిత సల్మాన్ రష్దీపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మెడపై కత్తితో పొడవడంతో ఆయన తీవ్రగాయాలయ్యాయి. 

Munugodu TRS Candidate: మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే

టీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో ఎవరు దిగనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఈ నెల 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరగనున్న ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.

Nizamabad News: పెళ్లి చేయట్లేదని కన్న తండ్రిని, బాబాయ్ ని హతమార్చిన కొడుకు

నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. మోపాల్ మండల కేంద్రంలో దారుణo చోటు చేసుకుంది. తండ్రి కర్ర అబ్బయ్య , నడిపి నాన్న సాయిలు  ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు కొడుకు కర్రల సతీష్... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుటుంబ కలహాలే హత్యలకు కారణమన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కర్రల సతీష్ గత కొంత కాలంగా పెళ్లి చేయాలని ఇంట్లో తరచూ గొడవపడే వాడని, పెళ్లికి ఆలస్యం చేస్తున్నారని, తండ్రి, అడ్డొచ్చిన చిన్నాన్నను హత్య చేశాడని తెలిపారు. తలపై గట్టిగా మోదీ చంపేశాడు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండగ పూట ఈ ఘాతుకానికి పాల్పడటంతో మోపాల్ గ్రామంలో విషాదం నెలకొంది.

Machilipatnam: మచిలీపట్నంలో దారుణం

  • క్రైస్తవులు పవిత్రంగా పూజించే మేరీమాత విగ్రహం ధ్వంసం

  • ఎస్పీ కార్యాలయం పక్కనే ఘటన

  • ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి

  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • సీసీటీవీ కెమెరాని సైతం పరిశీలిస్తున్న పోలీసులు

  • ఆసియం చర్చి దగ్గర భారీగా క్రైస్తవులు

  • రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం

  • చర్చి, సంస్థలలో  పనిచేయని సీసీటీవీ కెమెరాలు

Hyderabad News: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర తెల్లవారుజామున ఓ కారు బీభత్సం

  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర తెల్లవారుజామున ఓ కారు బీభత్సం

  • అతివేగంతో డివైడర్ ని కొట్టిన కారు

  • ఎయిర్ బెలూన్ ఓపెన్ ఆవడంతో తప్పిన ప్రాణాపాయం

  • మద్యం మత్తులో కార్ నడిపినట్టు అనుమానం

  •  జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి

  • కేసు నమోదు చేసుకుని బీభత్సం సృష్టించిన కారును పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు

Background

ఏపీ, తెలంగాణకు వర్షాల సూచన మరికొద్ది రోజులు ఉండనున్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఇక ఈ రేపు (ఆగస్టు 13) వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాతి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని చెప్పారు. 


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.


హైదరాబాద్ వాతావరణం ఇలా, నైరుతి నుంచి గాలులు
హైదరాబాద్‌లో వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ట్వీట్ చేశారు. నగరంలో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు (గాలి వేగం గంటకు 14 నుంచి 20 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది.


తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.  అయితే, వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ నెల 14న మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఏపీలో వాతావరణం
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర కు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.


అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్లు లేదా కొన్ని చోట్ల 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో 
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate)  నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉంది. వెండి ధర కూడా నేడు నిలకడగానే ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,200 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,200 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,650 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,200 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.