Breaking News Live Telugu Updates: చండూర్‌లో కాంగ్రెస్ ఆఫీస్ దగ్ధం, ప్రత్యర్థులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Oct 2022 02:57 PM

Background

బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష...More

ISRO News: ఇంటర్నెట్ సేవల విస్తరణకు జీఎస్ఎల్వీ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ మూడు సంస్థలు యూకేలోని నెట్‌ వర్క్‌ యాక్సెస్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌(వన్‌ వెబ్‌ కంపెనీ)తో ఒప్పంగం కుదుర్చుకున్న మేరకు ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.