Breaking News Live Telugu Updates: బీజేపీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోములు కూల్చేస్తాం - బండి సంజయ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Feb 2023 02:29 PM
Nagole News: నాగోల్ పెళ్లిలో అర్ధరాత్రి పోలీసుల హంగామా

  • నాగోల్ పెళ్లిలో అర్ధరాత్రి పోలీసుల హంగామా

  • పెళ్ళికొడుకు తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • రెండు నెలలుగా పరారీలో నిందితుడు, కొడుకు పెళ్లిలో ప్రత్యక్షం

  • మాటు వేసి కాపుకాసి అరెస్ట్ చేసిన మేడ్లల్ పోలీసులు

  • శుభం ఫంక్షన్ హాల్లో తెల్లవారుజామున పెళ్లి కొడుకు తండ్రి  శ్రీనివాస్ అరెస్ట్

  • ఒక కేసులో శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నామని చెప్తున్న పోలీసులు

  • ఒకవైపు పెళ్లి జరుగుతుండగా మరోవైపు తండ్రి అరెస్టు చేయడంతో పెళ్లిలో గందరగోళం

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోములు కూల్చేస్తాం - బండి సంజయ్

తెలంగాణలో కొత్తగా కడుతున్న సచివాలయం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయ నిర్మాణం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు. సచివాలయంలో మళ్లీ మార్పులు చేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయ డోమ్‌లు కూల్చేస్తామని చెప్పారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు నిందితులను తెల్లవారుజామున తరలించిన పోలీసులు

వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను తెల్లవారు జామున 4 గంటలకు పోలీసులు తరలించారు. కడప జైలులో ఉన్న నిందితులను భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు తరలించారు. కడప జైల్లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 ఉమా శంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలను నేటి ఉదయం సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు. ఈ క్రమంలోనే వారిని కడప జైలు నుంచి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ దస్తగిరిలు బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Nalgonda District: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్‌ వద్ద స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకి చెందిన నాగరాజు, హర్షిత్ సాగర్ కి చెందిన చంద్రకాంత్ లు పైలాన్ కాలనీ లో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలోకి దిగారు. మరో వైపు అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20.000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి ముగ్గురి యువకుల మృత దేహాలను బయటకి తీసి స్థానిక కమల నెహ్రూ హాస్పిటల్ కి మృత దేహాలను పొలీసులు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ పి.వెంకటగిరి సందర్శించారు.

SSLV Launching: ఇస్రో ప్రయోగం విజయవంతం

తొలి ప్రయత్నం SSLV D1 విఫలమైనా రెండోసారి ఇస్రో ఘన విజయం సాధించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D2 ని నింగిలోకి పంపింది. మొత్తం 3 ఉపగ్రహాలను విజయవంతంగా వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. SSLV మలి ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మొదలయ్యాయి. SSLV మిషన్ డైరెక్టర్ ఎస్.వినోద్ ని ఈ సందర్భంగా అభినందించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. SSLV భారత ఘనతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. గతంలో చేసిన తప్పులను ఐదు నెలల్లో సరిదిద్దుకున్నామని ఆ తర్వాత SSLV D2 ప్రయోగం మొదలు పెట్టామని చెప్పారు.

Background

నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో తెలంగాణలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐదు రోజుల క్రితం (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 7 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఇక ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 34.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే 13.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేసింది.


‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలుపట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.