Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Aug 2022 06:08 PM

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారగా, నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్...More

కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

తదుపరి సీజేఐగా సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌ ) నియమితులయ్యారు. ఆయన పేరును రికమండ్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేసిన మరుసటి రోజు (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు.