Breaking News Live Telugu Updates: చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Jan 2023 07:51 PM

Background

ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళలో చలి కాస్త...More

చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన మరవక ముందే, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు మహిళలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరులో  జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగించిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోగా, పంపిణీలో గందరగోళం నెలకొంది. కానుకల కోసం మహిళలు భారీగా తరలిరావడంతో సంక్రాంతి కానుక పంపిణీ కేంద్రం దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా,, మరికొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.