Breaking News Live Telugu Updates: నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Dec 2022 09:39 PM

Background

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి...More

నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు 

హైదరాబాద్ నాగోల్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ బంగారం షాపులో గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.