Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 27 Nov 2021 08:50 PM

Background

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు...More

పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

శ్రీకాకుళం జిల్లా పలాసలో 108 వాహనాన్ని ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. స్టేషన్ లో ఉన్న పేషెంట్ ను తీసుకెళ్లేందుకు 108 వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ పైకి వెళ్తోన్న క్రమంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 108 ను ఢీకొట్టింది. దీంతో 108 సిబ్బంది బయటకు దూకేశారు. దీంతో ఆనంద్ అనే 108 సిబ్బందికి భుజానికి గాయం అయ్యింది. 108 వాహనాన్ని ట్రైన్ 200 మీటర్ల వరకూ ఈడ్చుకువెళ్లింది.