Breaking News Live: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 15 Jan 2022 03:00 PM
మంచిర్యాలలో విషాదం.. గాలిపటం మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి

మంచిర్యాలలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అతడి భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో గాలిపటం ఎగరేసేందుకు వినియోగించిన మంజా దారం దారికి అడ్డంగా ఉంది. అది కనిపించని వాహనదారుడు అలాగే వెళ్లాడు. దారం కారణంగా వ్యక్తి గొంతుకు కోసుకుపోయింది.  అతడి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 

విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు

ఈ నెల 17 నుంచి 31 వరకు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నా్రు. కొవిడ్ దృష్ట్యా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెలాఖరు వరకూ.. ఆన్ లైన్ తరగతులు జరపనున్నారు.

యూపీ ఎలక్షన్స్: 53 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఎస్పీ

యూపీ అసెంబ్లీ ఎలక్షన్ తొలి దశ పోలింగ్ లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 58 స్థానాలకుగానూ 53 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను బీఎస్సీ చీఫ్ మాయావతి శనివారం రిలీజ్ చేశారు. మరో అయిదుగురు అభ్యర్థుల పేర్లను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

ప్రగతి భవన్  ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నం

స్థానికత ఆధారంగానే బదిలీలు చేయాలని ప్రగతి భవన్  ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నం చేశారు. సీనియారిటీ వద్దు, స్థానికతే ముద్దు అనే నినాదంతో జీవో నెం 317కు వ్యతిరేకంగా ఈ ముట్టడికి పిలుపునిచ్చారు. భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికే కంటే చావటం నయం అంటూ.. అడగనిదే అమ్మయిన పెట్టదు ఈ ప్రభుత్వం పెట్టె స్థాయిలో లేదంటూ వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఆలోచించండి.. పోరాటానికి సిద్ధం కండి.. నీకోసం నీ పిల్లల భవిషత్తు కోసం.. ప్రగతి భవన్ ముట్టడించాలని పిలుపునిచ్చారు.

విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ప‌తంగుల పండుగ‌

సంక్రాంతి సంబ‌రాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే ప‌తంగుల పండుగ‌ను విజ‌య‌వాడ వాసులు ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకుంటున్నారు. సంక్రాంతి సెల‌వులు ఆరంభం కాగానే ప‌తంగుల హాడావిడి దాదాపు 15 రోజులపాటు కొన‌సాగుతుంది. ఎక్క‌డ చూసినా రంగు రంగుల గాలిప‌టాలు విభిన్న‌మ‌యిన ఆకృతుల్లో ఆక‌ట్టుకుంటున్నాయి. సంక్రాంతి సంబ‌రాల్లో చిన్నా పెద్దా, వ‌యోభేదం లేకుండా ప‌తంగులు ఎగ‌ర‌వేసి ఆనందిస్తారు. ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతాల‌కే ప‌రిమితం అయ్యి ఉండే ప‌తంగులు ప్ర‌స్తుతం న‌గ‌రాల్లో సైతం విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి. గాలిపాటాల‌తో పాటుగా దాన్ని ఎగ‌ర వేసేందుకు ప్ర‌త్యేక చ‌ర‌క ,దారం త‌యారు చేసే వారికి కూడ ఈ సీజ‌న్ లో చేతినిండా పని దొరికింది. విజ‌య‌వాడ న‌గ‌రంలోని పాత‌బ‌స్తి చేప‌ల మార్కెట్ రోడ్డులో ప‌తంగుల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. ఒక‌ప్పుడు సొంతంగా త‌యారు చేసుకొని, ప‌తంగులు మార్కెట్ లో రెడీ మేడ్ గా చౌక‌గా అందుబాటులోకి రావ‌టంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

తణుకు నియోజకవర్గంలో కోడిపందాలు అడ్డుకున్న జనసేన 

పశ్చిమగోదావరి జిల్లా.. తణుకు నియోజకవర్గం మండపాకలో కోడిపందాలు నిర్వహిస్తుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు. గ్రామస్థులతో కలసి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కోడి పందాలు అడ్డుకున్నారు. కోడిపందాలు, గుండాట, పేకాట మాకొద్దు అంటూ ఘోరావ్ చేశారు. జనసేన నేతలు, స్థానికుల ఆందోళనలతో నిర్వాహకులు పందెం బరి నుండి వెళ్లిపోయారు. సంక్రాంతి అంటే సాంప్రదాయం అని, జూదం కాదని జనసేన నాయకులు అన్నారు.

తాడేపల్లిగూడెంలో జోరుగా పందుల పోటీలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పందుల పోటీలు నిర్వహించారు. కత్తులతో కోడిపందాలు, జూదాలతో కుటుంబాలు పతనమవుతున్న ఈ రోజుల్లో సంప్రదాయానికి పెద్దపీట వేశాం. ఏ విధమైన ప్రాణహాని లేకుండా రెండు జీవుల మధ్య జరిగే ఈ ఆట అందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని భావిస్తున్నామని ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు అన్నారు.
 

పాతబస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 3 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం

హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ పోలీసులతో కలిసి పాతబస్తీ లోని కాళీ-కమాన్, పథేర్‌ఘట్టి, మీర్‌చౌక్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత చైనా మాంజా 3 లక్షల విలువైన మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానులు మొహద్ రిజ్వాన్ & మొహ్సా & జాఫర్& సలీం లను అదుపులో తీసుకున్నారు. విచారణ నిమిత్తం నలుగురు యజమానులను స్వాధీనం చేసుకున్న చైనా మాంజాను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.


 రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు.. 
 1) మోనో గోల్డ్  చైన మాంజా
 2) తున్-తున్  చైన మాంజా
 3) సోనా బుల్బుల్ చైన మాంజా
 4) మోనో కైట్  చైన మాంజా
  5) గో ఇండియా  చైన మాంజా మరియు
 6) ఫిట్టర్ చైన మాంజా సీజ్ .
  

Background

నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరిగింది.


కోస్తాంధ్ర, యానాంలో జనవరి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వారానికి పైగా వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జనవరి 18 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
గత ఐదు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు జనవరి 17 వరకు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. మరి కొన్ని రోజులపాటు వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,100గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,900కి దిగొచ్చింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర నిన్న సాయంత్రం రూ.200 మేర పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,000కు చేరుకుంది. వెండి 1 కిలోగ్రాము ధర రూ.65,900 వద్ద మార్కెట్ అవుతోంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 27 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 అయింది. డీజిల్‌పై 25 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కి పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.94.35గా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.32 అయింది. ఇక్కడ డీజిల్ ధర రూ.96.41కి తగ్గింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ ధర 0.33 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.


Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..


Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్‌.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం


Also Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.