Breaking News Telugu Live Updates: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వార్డ్ మెంబర్ నాలుక కోసిన దుండగులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వార్డ్ మెంబర్ జవ్వాజి లింగంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. నాలుక కోసి, కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయల పాలైన లింగం ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జవ్వాజి లింగంపై ఎవరు దాడి చేశారన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో టీవీ ఛానల్ నటి మైథిలీ ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చి గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్ చేసుకుంది. సకాలంలో స్పందించిన పోలీసులు నిమ్స్ దవాఖానాకు తరలించారకు. ఎస్ఆర్ నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Delhi News : దిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడ నిడమానూరుకు చెందిన కొప్పుల మురళి అలియాస్ నాని (19), బొడ్డుల నాగేంద్రబాబు (21) ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. కొప్పుల మురళిని స్థానిక మత్య్సకారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. నాగేంద్రబాబు ఆచూకీ కోసం APSDRF, పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Karimnagar News : కరీంనగర్ జిల్లా చింతకుంట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోలెరో వ్యాన్ ను బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందు, మహేష్ బాబుగా పోలీసులు గుర్తించారు. హర్ష అనే యువకుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హర్ష చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన బాధితుల కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Vizag Port : విశాఖలోని పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సమాచారం మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Vizag Port : విశాఖలోని పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సమాచారం మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
సివిల్స్ 2021 ఓవరాల్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 685 మందిని సర్వీసులకు ఎంపిక చేసింది యూపీఎస్సీ. శ్రుతి శర్మ ఆలిండియా టాపర్‌గా నిలిచారు. అంకితా అగర్వాల్ రెండో ర్యాంకు, గామిని సింగ్లా 3, ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది టాప్ 5గా నిలిచారు.
వికారాబాద్ పట్టణానికి చెందిన వెంకట్ రెడ్డి అనే ఒక మొబైల్ షాప్ వ్యాపారవేత్త అకౌంట్లో 18 కోట్ల 52 లక్షల రూపాయలు పైన డబ్బులు పడడంతో సదురు అకౌంట్ హోల్డర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అప్పటికే తన అకౌంట్ లో రూ.2 లక్షల వరకు నగదు ఉన్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు డబ్బులు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగడం లేదని అకౌంట్ సీజ్ అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ కొనసాగుతుంది. మున్సిపల్ ఆవరణలో నేడు టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రజాదర్బార్ నిర్వహణకు సవాలు విసురుకున్నారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలు ప్రజల ముందు పెడతామన్న బీజేపీ బహిరంగ ప్రకటన చేసింది. దీంతో బీజేపీ సవాల్ కు టీఆర్ఎస్ సైతం ప్రజా దర్బార్ సవాలును స్వీకరించింది. ప్రజాదర్బార్ కు ఎలాంటి అనుమతి లేదంటు పోలీసులు ప్రకటనను సైతం విడుదల చేశారు.
పట్టణ శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజాదర్బార్ విరమించుకోవాలని పోలీసులు ఇరు పార్టీలకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజాదర్బార్ నిర్వహించకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపాలిటీ వద్ద భారీ బందోబస్తు చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ కొనసాగుతుంది. మున్సిపల్ ఆవరణలో నేడు టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రజాదర్బార్ నిర్వహణకు సవాలు విసురుకున్నారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలు ప్రజల ముందు పెడతామన్న బీజేపీ బహిరంగ ప్రకటన చేసింది. దీంతో బీజేపీ సవాల్ కు టీఆర్ఎస్ సైతం ప్రజా దర్బార్ సవాలును స్వీకరించింది. ప్రజాదర్బార్ కు ఎలాంటి అనుమతి లేదంటు పోలీసులు ప్రకటనను సైతం విడుదల చేశారు.
పట్టణ శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజాదర్బార్ విరమించుకోవాలని పోలీసులు ఇరు పార్టీలకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజాదర్బార్ నిర్వహించకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపాలిటీ వద్ద భారీ బందోబస్తు చేశారు.
మూడేళ్ల పాలన పై సీఎం జగన్ ట్వీట్
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది.
మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం.
ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం.
రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ. మా ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. రామరాజ్యం పుస్తకాల్లో చదివే వాళ్ళం, ఇప్పుడు జగన్ రూపంలో ఇప్పుడు నెరవేరిందన్నారు. ప్రజా ప్రక్షపాతిగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. రాజ్యాధికారంలో మహిళలకు పెద్దపీఠ వేయడమే కాకుండా, ప్రతిపథకానికి మహిళలనే లబ్ధిదారులుగా ఉంచడం సీఎం జగన్ మహిళా పక్షపాతిగా నిలుపుతుందన్నారు.
* ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ చిన్న చెరువులో శివ (23) అనే యువకుడు గల్లంతు
* నిన్న రాత్రి స్నేహితులతో చిన్న చెరువు వద్దకి వెళ్లిన శివ
* స్నేహితులతో ఛాలెంజ్ చేసి చెరువు మధ్యలోకి వెళ్లినట్లు సమాచారం
* సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
* శివ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్ రాంగోపాల్ పేటలో పబ్ వ్యవహారం కేసులో స్థానిక ఎస్సై పై వేటు పడింది. ఇన్‌స్పెక్టర్‌ను సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నడుస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకోవడంలో ఇన్‌స్పెక్టర్ చూసీ చూడనట్లుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. రాంగోపాల్‌పేట్‌లో అనుమతులు లేకుండా నడుస్తున్న తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
Background
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ తొలి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల మే 27న కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆ సమయానికి నాలుగు రోజులు ఆలస్యమైందని పేర్కొంది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే నైరుతి రుతుపవనాలు మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల రాక ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది.
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఈ జిల్లాల్లో పలు చోట్ల 44, 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణాలతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పొలం పనులు తాత్కాలికంగా విరమించుకోవడం ఉత్తమమని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో నేడు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో బాగా వేడిగా ఉండనుంది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -