Breaking News Live Updates: సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 May 2022 06:14 PM

Background

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో నేటి మరో నాలుగైదు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్...More

సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై  దాడికి పాల్పడ్డాడు. డీఎస్పీ సమక్షంలోనే పాల్ పై దాడి జరిగింది. కేఏ పాల్ సిరిసిల్ల రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.