Breaking News Live Updates: పరమ్ విశిష్ట్ సేవా మెడల్ అందుకున్న భారత ఆర్మీ చీఫ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
పరమ్ విశిష్ట్ సేవా మెడల్‌ను భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రాష్ట్రపతి రాంమ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో అధికారులపై ఓ యువకుడు దాడికి దిగాడు. అధికారులపై యువకుడు పెట్రోల్ తో దాడి చేశాడు. ఈ క్రమంలో ఎంపీవోకు మంటలు అంటున్నాయి. తుంగూరు గ్రామానికి చెందిన తిరుపతి, గంగాధర్ మధ్య దారి వివాదం నడుస్తోంది. దారి వివాదంతో రోడ్డు అడ్డంగా కర్రలు పెట్టాడు గంగాధర్. కర్రలు తొలగించేందుకు వెళ్లిన ఎస్‌ఐ, తహశీల్దార్, ఎంపీవోపై గంగాధర్ దాడి చేశాడు. ఎస్‌ఐ, తహశీల్దార్, ఎంపీవోపై పెట్రోల్ పోశాడు. ఈ దాడిలో నిప్పంటుకోవడంతో ఎంపీవోకు గాయాలయ్యాయి. ఆయన్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
* గుంటూరు గుంట గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్నిప్రమాదం
* పైపులు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్
* భారీగా ఎగసిపడుతున్న మంటలు
* రెండు దిచక్రవాహనం పూర్తిగా దగ్దం
* ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించిన స్థానికులు
* ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది..
* మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం..
* సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా
NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో సహా 18 మంది NSUI నాయకులకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చంచల్ గూడా జైలు నుంచి విడుదల కానున్నారు.
టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్, లీకేజీ కేసులో విచారణ జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుందన్నారు. నాలుగు రోజులపాటు గాలించి హైదరాబాద్‌లో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులోనూ నారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నారాయణను త్వరలోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారని మంత్రి బొత్స అన్నారు. నారాయణ అరెస్టుపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. చట్టపరంగా కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరికాసేపట్లో నారాయణ విద్యా సంస్థలు అధికారిక ప్రకటన ఇవ్వనున్నాయి.
రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన రద్దు
రేపు కోనసీమ జిల్లా మురమళ్ళలో మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్
తుఫాను ప్రభావంతో సీఎం జగన్ పర్యటన రద్దు
నారాయణ విద్యాసంస్థల అధిపతి, మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ లో మాజీ నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నాచారం పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కారు ఢీకొని చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన నాచారం రాఘవేంద్ర నగర్ లో జరిగింది. కారును నిర్లక్ష్యంగా వెనక్కి తీసుకున్న డ్రైవర్, కారు టైరు క్రింద నలిగిపోయిన చిన్నారి సిరి (3)అక్కడిక్కడే మృతి చెందింది.కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవేంద్ర నగర్ లో ఒక ఇంటిలో వాచ్ విమెన్ గా చేస్తున్న తల్లి రవళి, తండ్రి ఒక కంపెనీలో ప్రయివేటు ఉద్యోగి గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం చిన్నారి సిరి ఆడుకోవడానికి బయటికి రాగా అప్పుడే అక్కడి కి చేరుకున్న క్యాబ్ వెహికిల్ కాలనీలో వెనక్కి తీసుకుంటుండగా డ్రైవర్ అజాగ్రత్తగా వెనక్కి తీసుకోవడంతో వెనక టైర్ కింద పడి నలిగిపోయిన చిన్నారి సిరి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.
Background
Weather News: అసని తుపాను ఎఫెక్ట్ ఏపీపై కాస్త ఎక్కువగానే పడనుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆసాని తుఫాను కాస్తంత బలపడి మెల్లగా కాకినాడ - విశాఖపట్నం వైపుగా అడుగులు వేస్తోంది. అయితే, విశాఖ - కాకినాడ వైపుగా తుపాన్లు రావడం చాలా అరుదు. గత 200 సంవత్సరాల్లో మే నెలలో వైజాగ్ - కాకినాడ బెల్ట్ వైపుగా కేవలం 3 తుపాన్లు మాత్రమే వచ్చాయి.
అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మే 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలో ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. పెను గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అత్యధికంగా 60 కిలో మీటర్ల వేగంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక ఇస్తున్నాం’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
10వ తేదీ నుంచి 12 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ నగరం (ముఖ్యంగా), విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ నుంచి కాకినాడ దాక అతిభారీ, తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు కూడ 10, 11వ తేదీన తీవ్రంగా ఉంటాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం కలగనుందని వెల్లడించింది. ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇంకొన్ని ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చని అంచనా వేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -