AP CM Jagan Meet KCR: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గురువారం పరామర్శించారు. ప్రత్యేక విమానంలో తాడేపల్లి (Tadepalli) నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు (Begumpeta Airport) చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prasanth Reddy), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeswarareddy) స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ లోని నందినగర్ లో (Nandi Nagar) కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. అక్కడ జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, ఇటీవలే కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అనంతరం కొద్ది రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు.


లోటస్ పాండ్ కు


సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత ఆయన లోటస్ పాండ్ ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్ నివాసం సమీపంలోనే లోటస్ పాండ్ ఉండడంతో ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్, లోటస్ పాండ్ లో నివాసానికి వెళ్లనున్నారు.


Also Read: YS Sharmila: 'వైఎస్సార్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా' - ఆర్డర్ వేస్తే 'అండమాన్'లో బాధ్యతైనా నిర్వరిస్తానన్న షర్మిల