Breaking News Live: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి, మృతుల్లో చిన్నారి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Apr 2022 05:49 PM

Background

అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం...More

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి, మృతుల్లో చిన్నారి 

కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం యానం-ఎదుర్లంక బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బైక్ ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారికి గాయాలు అవ్వగా, మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వారధిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఐ.పోలవరం, యానాం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.