Breaking News Live: కాకినాడ రూరల్ మండలం కరప గ్రామంలో ఓఎన్జీసీ పైపు లైన్ గ్యాస్ లీకేజీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప గ్రామంలో సెంట్రల్ లే అవుట్ (జగన్ అన్న గృహ కల్పన )లో ఓఎన్జీసీ పైపు లైన్ గ్యాస్ లీకేజీ అవుతోంది. సంఘటన స్థలానికి చేరుకొని గ్యాస్ లీకేజీ స్థలాన్ని కరప తహసీల్దార్ పరిశీలించారు. ఓఎన్జీజీసీ అధికారులకు సమాచారం అందించారు.
ICC Women's World Cup | India beat Bangladesh by 110 runs: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ మరో విజయం సాధించింది. హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో మిథాలీ రాజ్ సేన ఘన విజయాన్ని అందుకుంది.
* మేడ్చల్ జిల్లా: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిద్రిస్తున్న వారిపై లారీ వెళ్లడంతో ఇద్దరు మృతి
* పేట్ బషీరాబాద్ పీఎస్ పరిది గోదావరి హోమ్స్ లో ఘటన
* నిర్మాణంలో ఉన్న భవనం ముందు నిద్రిస్తున్న చందన్ రామ్ (23), చందన్ కుమార్ సహరి (23)
* తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన లారీ
* వెనక్కి చూసుకోకుండా నిద్రిస్తున్న వారిపై వెళ్లడంతో మృతి
* మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తింపు
ఏపీ అసెంబ్లీలో నేడు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఈ నెల 25వరకు టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్, రామరాజు, సత్యప్రసాద్, రామకృష్ణ లపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు ఫైబర్ గ్రిడ్ అవినీతిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించగా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు.
ICC Womens WC 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హామిల్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
శ్రీశైలం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన యాగశాలను శాస్త్రోక్తకంగా ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన యాగశాల నిర్మాణ దాత బట్టి పర్వతయ్య, శారదాదేవి దంపతులతో దేవస్థానం యాగశాల నిర్మాణ పనులను గతఏడాది నవంబర్ 29 న చేపట్టింది. ఈ యాగశాల నిర్మాణం కృష్ణశిల రాతితో 16 స్థంభాలు కలిగి ప్రతి స్థంభంపైన అనేక దేవతామూర్తుల రూపాలు అష్టాదశశక్తిపీఠాలలో నెలకొన్న 18 రూపాలను, సప్తమాతృకలను, మరికొన్ని శక్తిరూపాలను ఈ యాగశాల కట్టడంపై మలిచారు. ఈ యాగశాల కట్టడంపై మలచిన దేవతామూర్తుల రూపాలు మొత్తం 62 కాగా యాగశాల బయట చండీ, యుండీ ద్వారపాలకీ రూపాలను ఏర్పాటు చేశారు ఉదయం యాగశాల నిర్మాణ దాత బట్టా పర్వతయ్య కుటుంబసభ్యులు సంప్రదాయకంగా స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు చేసి, సువర్ణ కలశాన్ని విశేషపూజాధికాలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని (14) ఏళ్ల మైనర్ బాలికపై పుల్లకుర్తి గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి( 41) కామాందుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని గతంలో కూడ బాలికపై రెండుసార్లు లైంగిక దాడి చేశాడని నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కోడుమూరు సిఐ.శ్రీధర్ తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలో నాలుగు బిల్లులకు నేడు ఆమోదం తెలపనున్నారు. బడ్జెట్ కేటాయింపులపై నాలుగో రోజు చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది.
Background
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం అసని తుఫాన్‌గా మారింది, నేడు తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అండమాన్ దీవి పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ ఈశాన్యంగా, అండమాన్ దీవులలోని మయబందర్‌కు 120 కి.మీ ఆగ్రేయంగా, మయన్మార్ లోని యంగూన్‌కు దక్షిణ, నైరుతి వైపు 560 కి.మీ దూరంలో తుఫాన్ ప్రస్తుతం ప్రభావం చూపుతోంది. ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ బంగాళాఖాతంలో ఆరు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి, అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదులుతోంది. ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..- (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. ఎండలు, ఉక్కపోత నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించింది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల నేడు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లాలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాలు ముఖ్యంగా మదనపల్లి పరిసరాల్లో ఎక్కువ వర్షాలుంటాయి. నెల్లూరు జిల్లాలో ఉరుములతో కూడిన వర్ష సూచన ఉంది. పొదల్కూరు-ఆత్మకూరు మధ్యలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఏపీ వెదర్ మ్యాన్.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
తెలంగాణలో కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎండల నుంచి ఉపశమనం కలిగినట్లు కనిపిస్తున్నా ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. నల్గొండలో పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 38 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో నల్గొండ ఒకటిగా భారీ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -