Case Filed On Mla Rajasingh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. సుల్తానాబజార్ (Sulthanbazar) పీఎస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తోన్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పీఎస్ లో వివిద సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసు పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 18న కేసు నమోదు చేయగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా, 5 రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై అప్జల్ గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది.


అయితే, ఈ కేసుపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. 'రామనవమి శోభా యాత్ర సందర్భంగా పలువురు సనాతన ప్రేమికులు.. యాత్రలో వచ్చిన రామభక్తులకు నీరు, భోజన ఏర్పాట్లు చేసి ఊరేగింపునకు సహకరించారు. ఇలా సాయం చేసిన వారిపై పోలీసు శాఖ బలవంతంగా కేసులు బుక్ చేసింది. రంజాన్ మాసంలో రాత్రంతా దుకాణాలు తెరిచి ఉంటాయని, హోటళ్లు తెరిచి ఉంటాయని తెలుసు. అలాంటప్పుడు రంజాన్ మాసంలో ఎన్నికల కోడ్ గుర్తుకు రాలేదా? ముస్లిం సమాజంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిసారీ వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడల్లా హిందూ మతాన్ని, హిందువులను అణచివేస్తోంది. హిందువులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను' అని రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా సుల్తానాబాద్ పీఎస్ లో మరో కేసు నమోదైంది.


Also Read: Telangana Students: తీవ్ర విషాదం - అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి