Breaking News Live: తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత

ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Nov 2021 06:34 PM
చెన్నై సమీపంలో తీరం దాటిన వాయుగుండం..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా గంటకు 4 కిలోమీటర్లవేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. 

తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత

తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేశారు అధికారులు. భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియల విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు.

బీజేపీ ఝూటా మాటలు నమ్మొద్దు: గంగుల కమలాకర్

రాష్ట్రంలోని బీజేపీ.. ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఫైరయ్యారు. తాము ప్రతి చివరి గింజ కొంటామని చెప్పామని కానీ వానకాలం పంట మాత్రం కొనం అని చెప్పింది ఎవరు అని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటికే 6,663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని అన్నారు. 5 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని మరోవైపు బీజేపీ మాత్రం రైతుల్ని మభ్యపెట్టేలా ధర్నాలకు దిగుతోందని అన్నారు. ఢిల్లీలో యాసంగి పంట కొనుగోలుపై ధర్నా చేయాలని సవాల్ విసిరారు. తాము 75 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని.. తాము నిర్వహిస్తున్న ధర్నాకి భయపడే కౌంటర్‌గా ఈరోజు బీజేపీ ధర్నా చేస్తోందని విమర్శించారు. వానా కాలంలో ప్రతి గింజా కొంటామని ఇప్పటికే రైతులకు హామీ ఇస్తున్నామని మిల్లు పట్టించిన తర్వాత ఎస్ఎఫ్ఐ ద్వారా కొనేలా బీజేపీ వాళ్ళు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయనట్లయితే వాళ్ల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు .అసలు బీజేపీ నేతల్లోనే ఐక్యత లేదని దీని విషయంలో తలో రకమైన ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఝూటా మాటలను నమ్మవద్దని రైతులను, ప్రజలను కోరుతున్నామని అన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు, నాలుగైదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో శీతకాల సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం

అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అబిడ్స్‌ జీపీవో వద్ద బైకు, బస్సు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Background

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయిని పట్టుకున్నారు. కౌకుర్ దర్గా వద్ద పోలీసులు రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు. 


షర్మిల యాత్రకు బ్రేక్


తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తన ప్రజా ప్రస్థాన యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడించారు. కోడ్‌ ముగిసిన వెంటనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. 21 రోజులు సాగిన ఈ యాత్రలో 6 నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు షర్మిల వివరించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.


Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!


వైద్యశాఖతో హరీశ్ రావు సమీక్ష


ప్రభుత్వ ఆసుపత్రులకు డాక్టర్లు సకాలంలో హాజరు కావాలని, నిర్దేశిత సమయం వరకు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులైన ఆయన.. బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో వైద్యులు రాకపోవడం, వచ్చినా నిర్ణీత సమయం వరకు ఉండకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇకపై అలా జరగకూడదని ఆదేశించారు.


Also Read: Weather Updates: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, హై అలర్ట్


జడ్జిలకు స్థాన చలనం


తెలంగాణలో తొమ్మిది మంది జిల్లా జడ్జిలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు వారిని ట్రాన్ష్ ఫర్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) సాయి రమాదేవి ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా ఇ.తిరుమల దేవి, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేష్, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వై.రేణుక, రాష్ట్ర వ్యాట్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌ పర్సన్‌ గా జి.అనుపమ చక్రవర్తి, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిగా బి.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్, నిజామాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ గా సీహెచ్‌‌కే భూపతి, సెషన్స్‌ జడ్జిగా సునీత కుంచాల, ఆదిలాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జిగా మంత్రి రామకృష్ణ సునీతలను ట్రాన్స్‌ఫర్ చేశారు.


Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.