= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షసూచన చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 29 అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నల్లజర్లలో సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు పశ్చిమ గోదావరి జిల్లా నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు చేశారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మూడు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. 13 డ్రమ్ములలో ఉన్న బెల్లం ఊట ధ్వంసం చేసి, మూడు గ్యాస్ సిలిండర్ లు, అల్యూమినియం సామాగ్రిని, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. 25 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 18న ప్రారంభమైన సమావేశాలు ఇవాళ్టి వరకూ జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు సభలు ఆమోదం తెలిపాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రైలులో అగ్ని ప్రమాదం.. దిల్లీ-ఛత్తీస్‌గఢ్ రైలులో నాలుగు కోచ్‌లలలో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ మెరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రం అందుకున్న కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని కవిత అందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొ్న్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులు కరోనాతో పోరాడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరాను. శివశంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ను ఫోన్‌లో సంప్రదించాను. శివశంకర్ మాస్టర్‌తో పాటు కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలని’ మంచు విష్ణు ఆకాంక్షించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏపీలో వర్షాలు, వరదలపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఏపీలో వర్షాలు, వరదలపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ‘కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుమల మాడవీధుల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. గడిచిన వందేళ్లలో ఇలాంటి వర్షాలు ఎప్పుడూ పడలేదు. మూడు రెట్లు వరద ఎక్కువగా వచ్చింది. రెండు, మూడు గంటల్లోనే వరద విరుచుకు పడింది. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల దిగువనే ఎక్కువ నష్టం వాటిల్లింది. పింఛ రిజర్వాయర్ సామర్థ్యం 0.32 టీఎంసీలు మాత్రమే. పింఛలో లక్షా 38 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్ ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్ ఎన్నికయ్యారు. తొలిసారి మైనారిటీ మహిళ ఈ పదవి దక్కించుకున్నారు. డిప్యూటీ చైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఎన్నిక నిర్వహించగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. మైనారిటీలపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కడప కలెక్టర్ తక్షణం స్పందిస్తే.. ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదన్న శైలజానాథ్ తుపాను వల్ల రాజంపేట నందలూరులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పించా డ్యామ్ తెగిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కూర్చుని పనులను పర్యవేక్షించడం హేయనీయం.. గతంలో పలు ప్రభుత్వాలు ఇలాంటి విపత్తులను ధీటుగా ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందంటూ కొంత మంది మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి వెలకట్టలేమన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జగిత్యాలలో రైతు ర్యాలీ, మహా ధర్నా ప్రారంభం జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ, మహా ధర్నా ప్రారంభమైంది. పండించిన పంటలను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాలలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతుల పాదయాత్ర సాగింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అన్నమయ్య డ్యామ్ వివాదం.. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నేతలు కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కట్ట తెగిపోవడంలో నిర్లక్ష్యం గా వ్యవహరించిన అధికారులపై విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. కడప పట్టణంలో జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఇసుక మాఫియా వల్లే ఈ నష్టం వాటిల్లిందన్నారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ గేట్లు తెరవలేదని అందుకే ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకోవాలని కోరారు. వరదల కారణంగా చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇచ్చేలా చూడాలని విన్నవించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అసెంబ్లీలో వ్యాఖ్యలపై భువనేశ్వరి లేఖ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు. తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నిరసన తెలిపిన వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. తాము ఎప్పటికీ విలువలు పాటిస్తున్నామని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన బండ్లగూడ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. శాసనసభా పక్షనేత రాజాసింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా లక్ష్మణ్, ప్రభారి పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాబూరావు తదితరులు తొలిరోజు సమావేశానికి హాజరయ్యారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆలయ సిబ్బంది, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో భారీ భూకంపం సంభవించింది. నేటి తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదయింది. థెంజాల్‌కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ తెలిపింది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భూమి కంపించిందని యూరోపియన్-మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మంటల్లో కారు.. తప్పిన ప్రమాదం రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుపల్లి దుర్గా నగర్ చౌరస్తా సమీపంలో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఇంజన్‌లో నుంచి మంటలు రావడంతో కార్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే స్పందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.