Breaking News Live: ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Jan 2022 02:52 PM

Background

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు తాజాగా ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి...More

ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.  నాదొక చిన్న మనవి, దయచేసి అవకాశం ఉంటే మనసు పెట్టి ఈ దిగువ వ్రాసిన పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని కోరుచున్నానండి.


1. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి.


2. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు వారు పేరు పెట్టాలి.


3. కోనసీమకి లోక్‌సభ దివంగత  స్పీకర్, స్వర్గీయ బాలయోగి పేరు నామకరణం చేయాలని ముద్రగడ్డ ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.