Breaking News Live: కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Jan 2022 08:04 PM

Background

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు దర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిసిసిపీ గల్ఫ్‌ పోర్ట్‌లో కొత్త...More

కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జన జాగరణ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీక్షకు అనుమతి లేదని కరీంనగర్ లోని జాగరణ సభావేదిక వద్దకు వచ్చిన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఇవాళ జన జాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 5 గంటల వరకు ఆయన జాగరణ దీక్ష చేసి నిరసన చేయాలని నిర్ణయించారు. దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదని కరీంనగర్ పోలీసులు అడ్డుకున్నారు.