Breaking News Live: విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Feb 2022 04:26 PM
మల్లన్న సన్నిధిలో నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన

కర్నూలు జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినీ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఉపాసన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు

విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పరవాడ మండలం ముత్యాలంపాలేంలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు జోగన్నపై  కొమ్ముకోనాం అనే చేప దాడి చేయడంతో మృతిచెందాడు. పరవాడ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిజంగానే చేప దాడి చేసిందా, లేదా వేరే ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌ని అడ్డుకునే యత్నం.. మేడ్చెల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు , స్థానిక మంత్రి మల్లారెడ్డి గత అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికలలో జవహర్ నగర్ ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు, స్థలాల క్రమబద్ధీకరణ, మంచినీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ తదితర సమస్యలపై హామీలు ఇచ్చారు. హామీలను ఇంతవరకూ అమలు చేయకపోవడంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఈరోజు మంత్రిని సమస్యలపై నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులు తలపెడితే ప్రభుత్వం పోలీసులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బలవంతంగా, అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బందించారు. హరి వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించి పోలీసుల నిర్బంధంతో అరెస్టు అయ్యారు.


ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లావ్యాప్తంగా దీనిని తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరారు. అరెస్టయినవారిలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, బండ కింద ప్రసాద్ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరిత, దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షులు ముప్పా రామారావు, జవహర్ నగర్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

మేడ్చల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హెచ్‌ఎండీఏ చేపట్టిన చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జలమండలి చేపట్టిన ఓఆర్‌ఆర్ పేజ్ 2 పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ పనులను కూడా మంత్రి కేటీఆర్ మొదలుపెట్టారు. 

నేటితో ముగియనున్న టోనీ కస్టడీ

డ్రగ్ ఫెడ్లర్ టోని కస్టడీ నేటితో ముగియనుంది. ఐదవరోజు రోజు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నేడు చివరిరోజు కావటంతో నేటి విచారణ కీలకం కానుంది. ఇప్పటికే పోలీసులు పలు కీలక వివరాలు రాబట్టారు. టోనీ ఫోన్ కాల్ డేటా, బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్స్ వివరాలను అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు.

నేటి నుంచే రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణం సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉయదం నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 రోజుల పాటు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. వేలాది మంది వాలంటీర్లు, రుత్విక్కులు, ఇతరుల రాకతో ముచ్చింతల్‌లో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా ఉంది.

Background

ఈ ఏడాది భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. అంతేకాక, ఆయనకు వరాల జల్లు కురిపించారు. రామచంద్రయ్య సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసానికి అనువైన ఇంటి స్థలం, అందులో ఇల్లు నిర్మించుకోవడం కోసం రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనందున మంగళవారం రామచంద్రయ్య ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళ అయిన డోలు వాయిద్యాన్ని రామచంద్రయ్య బతికిస్తున్నందుకు సీఎం కేసీఆర్ అభినందించారు. 


రామచంద్రయ్య ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మోగక్షేమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. అంతేకాక ప్రభుత్వ విప్‌ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.


ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు వాయువ్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


‘‘తేమ గాలులు, చల్లటి నేల ఉండటం వల్ల రేపు తెల్లవారిజామున దట్టమైన పొగ మంచు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించనుంది. చల్లటిగాలులతో పాటు పొగ మంచు కూడ ఉండనుంది. ఈ ప్రాంతాల్లో హైవేలపై వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాల’’ని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


విశాఖపట్నంలో విషాదం.. చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి


విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పరవాడ మండలం ముత్యాలంపాలేంలో చెపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు జోగన్నపై  కొమ్ముకోనాం అనే చేప దాడి చేయడంతో మృతిచెందాడు. పరవాడ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిజంగానే చేప దాడి చేసిందా, లేదా వేరే ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.