మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం...More
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.తెలంగాణకు భారీ పెట్టుబడితెలంగాణలో మరో ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఎలాంటి ప్లాంట్ లేని ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ .. తెలంగాణలో రూ. ఐదు వందల కోట్లతో ప్లాంట్ పెట్టాలని డిసైడయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణలో ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో రెండు దశల్లో మొత్తం రూ. ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌ను భవిష్యత్‌లో పదిలక్షల లీటర్లకు పెంచుతారు. ఈ ప్లాంట్‌లో బట్టర్ మిల్క్, పెరుగు, లస్సి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో పాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తారు. తెలంగాణ లో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అమూల్ ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాతావరణంతెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రజలను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఉత్తర దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి.తెలంగాణలో గురువారం (డిసెంబరు 30) వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు. బుధవారం నాడు రాష్ట్రంలో నిజామాబాద్ సహా కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది.ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అటు విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా ఉంటున్నాయి. ఆంధ్రా కశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి తీవ్రంగానే ఉంది. ఏపీలోని అనంతపురంలో అత్యల్పంగా 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత జంగమేశ్వరంలో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంనట్లుగా అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.