Breaking News Live: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్... విద్యాశాఖ సంచలన నిర్ణయం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Dec 2021 06:32 PM

Background

నడిరోడ్డుపై నెలలు నిండని పిండంహైదరాబాద్‌లో నెలలు నిండని పిండం అల్వాల్ సమీపంలోని అంజనాపురి కాలనీ వీధిలో కనిపించడం కలకలం సృష్టించింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్‌లోని అంజనాపురి కాలనీ వీధిలో ఉదయం సుమారు 4 నెలల వయసున్న...More

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ 

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తునట్లు ప్రకటించింది. ఇటీవల ఫలితాల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కనీస మార్కులతో పాస్ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.