Breaking News Live: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులని పాస్ చేయండి: జగ్గా రెడ్డి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Dec 2021 03:38 PM

Background

హైదరాబాద్‌లోని పబ్స్‌, హోటళ్ల యజమానులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌, పలువురు అసోసియేషన్‌ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు....More

దీక్ష విరమించిన జగ్గారెడ్డి

తెలంగాణలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన దీక్ష చేపట్టారు. ఈ సంద్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను పాస్ చేశారని.. తెలంగాణలో మాత్రం పరిస్థితి మరోలా ఉందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారంలోపు ప్రభుత్వం ఏ విషయం ప్రకటించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చనిపోతుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.