Breaking News Live: క్యాంపు కార్యాలయంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Dec 2021 12:15 PM

Background

గోదావరిఖనిలోని గంగా నగర్ వద్ద గల బ్రిడ్జిపై నుండి వెళుతున్న లారీ మరో లారీని ఢీకొంది. ఇందులో ఒక లారీ ఆ పక్కనే వెళ్తున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. రామగుండ కి చెందిన షేక్ షకీల్...More

క్యాంపు కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగాయి. కేక్ కట్ చేసి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మంత్రులు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స నారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.