Breaking News Live: కూనేపల్లిలో జల్లికట్టు.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తుల వాగ్వివాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 19 Dec 2021 02:43 PM
Background
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ పదో ఎడిషన్‌లో దాదాపు 6 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. నెక్టెస్ రోడ్డు పీపుల్స్...More
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ పదో ఎడిషన్‌లో దాదాపు 6 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. నెక్టెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకూ ఈ మారథాన్ సాగుతోంది. ఈ మారథాన్ సందర్భంగా ఉదయం 5.30 నుంచే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్ - గచ్చిబౌలి మార్గంలో అన్ని ప్రధాన రహదారులను మూసి వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంమెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం కొండాపూర్ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న రాజేష్ భార్య నవ్య, తల్లి పద్మలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోల్, డీజిల్ ధరలుహైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 19) పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే కొనసాగుతోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.88గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.67 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.95గా ఉంది. ఇది రూ.0.62 పైసలు పెరిగింది.ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.16 పైసలు తగ్గి రూ.110.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.బంగారం ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వెండి ధర కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,570 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,850 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,570 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,570 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కూనేపల్లిలో జల్లికట్టు.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తుల వాగ్వివాదం
తిరుపతి : సంక్రాంతి ముందే పోట్లగిత్తలు రంకెలేస్తున్నాయి. రామచంద్రాపురం(మం) కూనేపల్లిలో జల్లికట్టు నిర్వహించగా.. ఎద్దుల కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీ పడ్డారు. దీంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వాగ్వివాదం చోటుచేసుకుంది.