Breaking News Live: తెలంగాణలో ఒమిక్రాన్ మరో కేసు.. హన్మకొండలో గుర్తింపు: డీహెచ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Dec 2021 12:15 PM
హన్మకొండలోనూ ఒమిక్రాన్ గుర్తింపు

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసును గుర్తించారు. కొత్తగా హన్మకొండలో ఓ కొత్త ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ 8 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించారు. గతంలో కొవిడ్ బారిన పడ్డ వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతోందని డీహెచ్ చెప్పారు. 

ఎన్నికల సంస్కరణలపై త్వరగా నిర్ణయం తీసుకోండి: విజయసాయిరెడ్డి

కేంద్ర ఎలక్షన్ కమిషన్, లెజిస్లేటివ్ డిపార్టుమెంట్ల మధ్య పెండింగులో ఉన్న ఎన్నికల సంస్కరణలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు వైఎస్సార్ సీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి. ఆధార్ కార్డును ఓటర్ లిస్టుతో అనుసంధానం చేయడం, పెయిడ్ న్యూస్ ను, తప్పుడు అఫిడవిట్లు సమర్పించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే నిబంధనలను త్వరగా చట్టబద్ధం చేయాలని ఎంపీ కోరారు.





కరోనా కేసుల కలకలం.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అందాల పోటీలలో కలకలం రేపుతున్నాయి. మిస్ ఇండియా మానస వారణాసి సహా 17 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మిస్ వరల్డ్ అందాల పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 16వతేదీన ప్యూర్టోరికోలో ఫినాలే జరగాల్సి ఉండగా.. కరోనా కేసులు రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.

అమరావతి ఐకాస బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న రైతులు

తిరుపతి సభకు వెళ్లేవారిని ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు జిల్లాల నుంచి తిరుపతి సభకు తరలివస్తున్న వారిని ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. అమరావతి ఐకాస బహిరంగ సభకు రాజధాని గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

కార్పొరేషన్‌కు ఛైర్మన్ల నియామకం

తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం జరిగింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారి పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

బన్సీలాల్‌పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: బన్సీలాల్‌పేటలో నిర్మించిన 248 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రధాన రహదారిలోని జాబితాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలంలో రూరల్ సీఐ కృష్ణకుమార్, గొల్లపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి ,టౌన్ ఎస్ఐ ప్రమీల మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

Background

నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం ఎడవెల్లిలో దారుణం జరిగింది. భూ వివాదాల నెపంతో ఓ మహిళపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. దెబ్బలకు తాళలేక బాధితురాలు తిరుపతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి(16) ప్రాణాలు తీసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు తిట్టారని మనస్తాపం చెందిన బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది.


పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9, విశాఖపట్నం జిల్లా మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.


బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.30 చొప్పున పెరిగింది. పది గ్రాములకు రూ.300 పెరిగింది. వెండి ధర రూ.0.50 పైసలు పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,420 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 17)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే కొనసాగుతోంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.18 పైసలు తగ్గి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.25 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది రూ.0.23 పైసలు తగ్గింది. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.31 పైసలు పెరిగి రూ.110.51 గా ఉంది. డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.96.59గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.