Breaking News Live: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Dec 2021 04:30 PM
శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు

శిల్పా చౌదరికి బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉప్పర్ పల్లి కోర్టు. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టు అయిన విషయం తెలిసిందే. పెట్టుబడుల పేరుతో పలువురి నుంచి డబ్బులు తీసుకున్నారు శిల్ప చౌదరి.

శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు

శిల్పా చౌదరికి బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉప్పర్ పల్లి కోర్టు. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టు అయిన విషయం తెలిసిందే. పెట్టుబడుల పేరుతో పలువురి నుంచి డబ్బులు తీసుకున్నారు శిల్ప చౌదరి.

నానక్ రాంగూడ చోరీ కేసు చేధించిన పోలీసులు

గచ్చిబౌలి నానక్ రాంగూడ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. నకిలీ సీబీఐ అధికారుల పేరుతో జయభేరీ ఆరెంజ్ కౌంటీలో ఓ కుటుంబాన్ని దుండగులు మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు విచారణ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి సుబ్రమణ్యం వద్ద పని చేస్తున్న జస్వంత్ ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు జస్వంత్ తో పాటు దోపిడీకి సహకరించిన జస్వంత్ ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 60 లక్షల 75 వేల రూపాయలు విలువ చేసే 1,340 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్మెంట్ జోన్

ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్‌లో గుర్తించడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో తాజాగా మరోసారి కంటైన్మెంట్ జోన్ ఏర్పడినట్లయింది. టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీలో ఇద్దరు విదేశీ వ్యక్తులకు ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. వారు పారామౌంట్ కాలనీకి చెందిన వారు కావడంతో అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నందున వైద్య అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో అమరులైన సైనికులకు ప్రధాని మోదీ నివాళి

బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పాకిస్థాన్‌తో 1971 జరిగిన యుద్ధంలో అమరులైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారు. ఉదయం 10:30 గంటలకు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తారు. 'స్వర్ణిమ్ విజయ్ మషాల్ వద్ద అమర జ్యోతిని వెలిగిస్తారు.

చిరుతపులి దాడి

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో ఇద్దరు వ్యక్తులపై చిరుత పులి దాడి చేసింది. విజిలెన్స్‌ అధికారుల సమాచారం మేరకు.. తిరుమలలోని వరాహస్వామి కాటేజీలో పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, ఆనందయ్య విధులకు హాజరయ్యేందుకు తిరుపతి నుంచి బైక్‌పై తిరుమలకు బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయంలో వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు దాటేందుకు సిద్ధంగా ఉన్న ఓ చిరుత వీరి బైక్‌ పైకి దూకింది. గమనించిన రామకృష్ణారెడ్డి, ఆనందయ్య బైక్‌ ఆపకుండా వేగంగా ముందుకెళ్లారు. చిరుత పంజా తగలడంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

శ్రీవారిని దర్శించుకోనున్న అఖండ టీమ్

శ్రీవారి దర్శించుకొనేందుకు అఖండ చిత్ర టీమ్ తిరుమలకు చేరుకుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు బుధవారం రాత్రి రాధేయం అతిధి గృహంలో‌ బస చేశారు. గురువారం ఉదయం చిత్ర టీమ్ శ్రీవారిని దర్శించుకొనుంది.

Background

ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకి వచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. కాకపోతే, బస్సులోనే ఉన్న ప్రయాణికుల సామాన్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రైవేటు బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వస్తుండగా ఇలా కాలిపోయింది.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 16)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.68 గానే కొనసాగుతోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.25 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది రూ.0.23 పైసలు తగ్గింది. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.09 పైసలు తగ్గి రూ.110.20 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు తగ్గి రూ.96.28గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.


బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.25 చొప్పున తగ్గింది. పది గ్రాములకు రూ.250 తగ్గింది. వెండి ధర రూ.0.70 పైసలు తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.