Breaking News Live: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పవన్ దీక్ష ప్రారంభం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Dec 2021 11:14 AM
నల్లకుంటలో మందుబాబు బీభత్సం

హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మందుబాబు కారు భీభత్సం రేపాడు. ఆదివారం తెల్లవారు జామున విద్యానగర్ రైల్వే బ్రిడ్జిపై ఓ కారు దూసుకొచ్చి.. డివైడర్‌ను ఢీకొంది. ఉదయం పూట ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించాడు. సంఘటన స్థలంలో అతనికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేశారు.

పవన్ కల్యాణ్ దీక్ష ప్రారంభం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులు అర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దీక్ష విరమించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 

సొంత గ్రామానికి చేరుకున్న సాయితేజ్ భౌతిక కాయం

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మరణించిన లాన్స్ నాయక్ సాయి తేజ భౌతిక కాయం ఆయన స్వస్తలం ఎగువరేగడకు చేరింది. బెంగళూరుకులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి సాయితేజ భౌతిక కాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీలకబైలు చెక్ పోస్టు మీదుగా రోడ్డు మార్గంలో 30 కిలో మీటర్ల మేర భారీ ర్యాలీగా తీసుకెళ్తున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

భాగ్యలక్ష్మీ ఆలయంలో హైకోర్టు సీజే పూజలు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ శనివారం భాగ్యలక్ష్మి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్టీలు శశికళ, సూర్యప్రకాష్‌ సీజే కుటుంబానికి స్వాగతం పలికి వారిని సత్కరించారు. అమ్మవారి చిత్రపటంతోపాటు ప్రసాదాన్ని కూడా అందజేశారు.

చిత్తూరు జిల్లాకు చేరుకున్న సాయితేజ పార్థివదేహం

తిరుపతి : బెంగళూరు నుండి చిత్తూరు జిల్లాకు సాయితేజ పార్ధివదేహం చేరుకుంది.. పుంగనూరు మార్గం నుండి ర్యాలీగా ఎగువరేగడ గ్రామంకు సాయితేజ పార్ధివ దేహం చేరుకోనుంది. ముందుగా అభిమానులు,స్నేహితులు నివాళులు అర్పించిన తరువాత ర్యాలీ ప్రారంభంమైంది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సాయితేజకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. 

Background

హైదరాబాద్ నగరంలోని దుండిగల్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో వెంటనే స్పందించిన ట్విటర్‌ యాజమాన్యం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో (ఆదివారం) ప్రధాని మోదీ పర్సనల్ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది. దేశంలో బిట్‌ కాయిన్‌లు లీగలైజ్ చేశామంటూ మోదీ ట్విటర్ నుంచి ట్వీట్ వెలువడింది. కాబట్టి బిట్ కాయిన్లు కొనాలంటూ గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు పోస్టులు చేశారు. భారత్‌లో ప్రభుత్వం 500 బిట్‌ కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింకులు కూడా పోస్ట్‌ చేశారు.


అయితే, ఈ వ్యవహారంపై వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పందించింది. హ్యాకర్ల ట్వీట్‌పై పీఎంవో అధికారులు ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను ట్విటర్ తొలగించింది. అనంతరం ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతాను రీస్టోర్‌ చేశారు. కాగా, హ్యాకింగ్‌ సమయంలో ట్వీట్‌లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం విడిగా మరో ట్వీట్ చేస్తూ విజ్ఞప్తి చేసింది.


Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే 


తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చితోడ్ లో ఓ పరిశ్రమలో విష వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఆ పరిశ్రమ యజమాని మృతి చెందగా, 13 మంది ఆసుపత్రి పాలయ్యారు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీధర్ కెమికల్స్ లో శనివారం మధ్యాహ్నం క్లోరిన్ గ్యాస్ పైపులో సమస్య తలెత్తి గ్యాస్ లీక్ అయింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న యజమాని దామోదరన్(40) క్లోరిన్ గ్యాస్ పీల్చి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరో 13 మంది ఈ విషవాయువు పీల్చడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో  వారిని ఈరోడ్‌లోని తాంథై పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.