Breaking News Live: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ ఫార్మా సిటీ SNF ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రాణానష్టం లేకపోవడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. భారీగా మంటలు ఎగసి పడడంతో సమీప గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పరవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు షెడ్యూల్ (23-4-2022)
ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వనపర్తిజిల్లాలోకి ప్రవేశించింది. శనివారం మాదాసి కురువ, మున్నూరు కాపు సంఘాల నాయకులతో బండి సంజయ్ భేటీ అవుతారు. ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కృష్ణం పల్లి ఎక్స్ రోడ్ వద్ద బండి సంజయ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. కృష్ణం పల్లి జెండా ఆవిష్కరణ పాదయాత్ర 100 కి.మీ పూర్తయిన సందర్బంగా బండి సంజయ్ సమక్షంలో కార్యకర్తలు కేక్ కటింగ్ చేయనున్నారు.
ఈర్లదిన్నె-
జండా ఆవిష్కరణ,
రైతులు గ్రామసభ.
మిట్టనందిమళ్ళ- సన్మానం, మహిళల తో హారతి,
జండా ఆవిష్కరణ, రచ్చబండ.
మిట్టనందిమళ్ళ తర్వాత భోజన తర్వాత భోజన విరామం.
* విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు యునియన్ ఎన్నికలు ప్రారంభం
* ఉదయం 5 గం. నుండి సాయంత్రం 4 గం వరకు ఎన్నికలు
* ప్రధానంగా ఐఎన్ టీయూసీ, సింహం.. ఏఐటీయూసీ గులాబీ... సీఐటీయూ గంట గుర్తుపై పోటీ
* 10,590 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
* స్టీల్ ప్లాంట్ లో 13 పోలింగ్ బూత్ లు, బయట ట్రైనింగ్ సెంటర్ లో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు
* ఎన్నికలు సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు
తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయం వెలుపల సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వేసవి సమయంలో తిరుమలలో భక్తులు రాక అధికంగా ఉంటుందన్నారు..మే నెల దగ్గర వస్తున్న క్రమంలో సామాన్య భక్తుల కోసం చలువ పందిళ్ళు వంటి సౌఖర్యాలు టిటిడి ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు.
జగిత్యాల - కరీంనగర్ మార్గంలో నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. పూడూర్ దాటిన తర్వాత లారీని రెండు వ్యాన్లు ఢీ కొట్టాయి. ఆ వెంటనే కోడి గుడ్ల వ్యాను కూడా అక్కడ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో స్థానికులు కోడి గుడ్లను ఎగబడి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ టోల్‌గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ - ప్రయాణికులతో ఉన్న ఓ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు గమనించి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ఈ మార్గం నుంచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్తుండగా తన కారు ఆపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Background
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Light To Moderate Rain Or Thundershowers)ఉంటాయని, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్నం తెలిపారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు. మరో అల్పపీడన ద్రోణి కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ, ఏపీలో నిన్న సాయంత్రం కురిసిన వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల వారికి ఊరట కలుగుతోంది.
తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు..
తేలికపాటి జల్లులు కురవడంతో హైదరాబాద్ నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. కొన్ని రోజుల కిందటి వరకు 41 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో రెండు రోజులపాటు నగరంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వేసవి వర్షాలు కనుక పిడుగులు పడే అవకాశం అధికంగా ఉంటుందని, ప్రజలు చెట్ల కింద, పాడుబడిన ఇళ్ల కింద తలదాచుకోవడం చేయకూడదని హెచ్చరించారు.
ఏపీలో ఇక్కడ వర్షాలు.. అక్కడ ఎండలు
ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలలో చలి గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉమ్మండి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేసవి తాపానికి ప్రజలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడుతున్నారు. రాయలసీమ ప్రజలు రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. వేసవి వర్షాల్లో పిడుగుపాటు అవకాశం అధికమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -