Breaking News Live: ఫిబ్రవరి 15న కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 29 Jan 2022 05:07 PM

Background

దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు...More

ఫిబ్రవరి 15న పోలీస్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 15వ తేదీ సీఎం కేసీఆర్  కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ను నిర్మిస్తోంది. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు