Amith Shah Visit Khammam: ఖమ్మం జిల్లాలో ఈ రోజు (ఆగస్టు 27) బీజేపీ పెద్ద ఎత్తున సభను నిర్వహించబోతోంది. రైతు గోస - బీజేపీ భరోసా పేరిట నిర్వహించబోతున్న బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ అశావహా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలు వస్తుండడంతో... బీజేపీ మరింత సన్నద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజవాడ చేరోకునున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపు 20 మది వరకు ముఖ్య నేతలు ఆ భేటీలో పాల్గొననున్నారు. 










ఈ సమావేశం ద్వారా బీజేపీ శ్రేణులను ఎన్నికల కోసం సన్నద్ధం చేస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ముందుకు వెళ్లేలా పార్టీ నేతలకు కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. అయితే అమిత్ షా ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని బీజేపీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ పార్టీ ప్రచారానికి ఊపునిస్తుంది. అమిత్ షా జూన్‌లో ఇక్కడ ర్యాలీ నిర్వహించా ప్రసంగించాల్సి ఉండగా.. తుఫాను బిపార్జోయ్ కారణంగా వాయిదా పడింది.