Horoscope Today 2023 August 27th
మేష రాశి
ఈ రాశి వారు అధికారుల సహకారాన్ని అందుకుంటారు. తమకు ఇచ్చిన బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తారు. వ్యాపారం చేసిన వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అన్ని రకాల శుభ ఫలితాలు ఉంటాయి. మీ వల్ల మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమందికి మేలు జరుగుతుంది. ఇతరులపై మీరు ఆధారపడకుండా సొంతంగా కష్టపడి పనులను సాధించాలి. ఏదైనా శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని సందర్శించుకుంటే అన్ని రకాలుగా శుభప్రదం.
వృషభ రాశి
వ్యాపారం చేసే వారికి విశేష లాభాలు ఉంటాయి. కీలక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడతారు. వారం మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రాశి వారు విష్ణు ఆరాధన చేస్తే సర్వవిధాలా మంచిది.
మిధున రాశి
మిధున రాశి వారికి గ్రహబలం అధికంగా ఉంది. అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు వినాయకుడిని ఆరాధిస్తే అన్ని విధాల శుభప్రదం.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఎదగడానికి ఇదే అనుకూలమైన సమయం. వృత్తిలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ఆశయం నెరవేరుతుంది. ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.
సింహరాశి
ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం మంచిది. తొందరపాటుతో చేస్తే అనుకూల ఫలితాలు రాకపోవచ్చు. అప్పులు పెరగకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ అపార్ధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. మీరు చేపట్టే ముఖ్య కార్యాల్లో విజయం లభించే అవకాశం ఉంది. వారాంతంలో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలా శ్రేయస్కరం.
కన్యారాశి
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెడితే మంచిది. నిర్ణయాలు మీకు మీరు స్వయంగా తీసుకొని అమలు చేయండి. ఇతరుల సలహాలను పట్టించుకోవద్దు. ఏకాగ్రత చాలా ముఖ్యం. పనులు వాయిదా వేయడం మానుకోండి. కొందరు మీ మనసును బాధ పెట్టవచ్చు. అయినా తొందరపడకండి. దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుని ముందుకు సాగండి.
తులారాశి
తులారాశి వారికి ఉద్యోగంలో అన్ని విధాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలోనూ లాభాలను గడిస్తారు. వీరికి అన్ని విధాలా విజయమే లభిస్తుంది. అదృష్ట యోగం కనిపిస్తోంది. పనుల్లో విజయం తప్పదు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇంకా మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. అయితే ఖర్చులు పెరగకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే వార్తను అందుకుంటారు. పట్టుదలగా పనులు చేయాలి. సూర్యాష్టకం పఠిస్తే అన్ని విధాలా మేలు.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీకు నచ్చిన దైవాన్ని ఆరాధించండి. అంతా మేలే జరుగుతుంది.
మకర రాశి
ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతోను స్నేహితులతోనూ చాలా నెమ్మదిగా వ్యవహరించాలి. లేకుంటే అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి పడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకోవడం మంచిది. వాయిదా మానుకొని సకాలంలో పనులు పూర్తిచేస్తే అడ్డంకులు రాకుండా ఉంటాయి. శనిదేవుని దర్శించుకుంటే సత్ఫలితాలు వస్తాయి.
కుంభరాశి
తొందరపాటు నిర్ణయాలు మానేసి ప్రశాంతంగా ఉండాలి. ఆవేశపడకూడదు. సహనంతోనే పనులు పూర్తవుతాయి. మనోబలం చాలా ముఖ్యం. మీ మనోబలంతోనే అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. సూర్యాష్టకం చదివితే అన్ని విధాలా మంచిది.
మీనరాశి
ఈ రాశి వారికి అదృష్ట కాలమనే చెప్పాలి. వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలోనూ లాభాలు ఉంటాయి. వస్తు, వస్త్రాల ప్రాప్తి ఉంటుంది. ఎంతోమందికి మీ వల్ల మేలు జరుగుతుంది. మీకు నచ్చిన దేవతను ఆరాధించి ఆ దేవతా స్తోత్రాలను చదివితే అన్ని విధాలా మంచిది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.