ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ఎంపీ ల్యాడ్ నిధుల పంపిణీ వివాదస్పదంగా మారింది. తాను ల్యాడ్స్ నిధులను ఇంటి నిర్మాణం కోసం వాడుకున్నట్లుగా కుండబద్దలు కోట్టినట్లుగా ఎంపీ చెప్పారు. తన కుమారుడి పెళ్లి, ఇంటినిర్మాణం కోసం నిధులు వాడుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ గతంలో ఉన్న ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ సంవత్సరం ల్యాడ్ నిధులు రావడంతో బీజేపీ ప్రజాప్రతినిధులకు కేటాయించడానికి ఆదిలాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రజాప్రతినిధులకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ నాయకులు తనపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంటి నిర్మాణం కోసం ల్యాడ్ నిదులు వాడుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిధుల దుర్వినియోగం చేసిన ఎంపీపై చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
Soyam Bapu Rao: ఎంపీ నిధులతోనే నా కొడుకు పెళ్లి, ఇల్లూ కట్టుకున్నా - బీజేపీ ఎంపీ సంచలనం
ABP Desam
Updated at:
19 Jun 2023 03:58 PM (IST)
తాను ల్యాడ్స్ నిధులను ఇంటి నిర్మాణం కోసం వాడుకున్నట్లుగా కుండబద్దలు కోట్టినట్లుగా ఎంపీ సోయం బాపూరావు చెప్పారు.
సోయం బాపూరావు (ఫైల్ ఫోటో)