మినిస్టర్ కేటీఆర్ కు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వస్తున్నాయి. అయితే నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. 
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పొలిటికల్ లీడర్ గా కేటీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా విషయాలకు తన దృష్టికి వచ్చిన వాటికి స్పందిస్తూ తన దైన శైలిలో పరిష్కారం చూపుతారు. నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్ కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో కేటీఆర్ కు హగ్ ఇచ్చిన ఫోటోను ట్విట్టర్ పోస్టు చేశాడు సోనూసూద్.



'కేటీఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు భవిష్యత్ అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ సానుకూల దృక్పథం అదే రీతిలో.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశాలు మరింత మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని. మీరు నాకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి సూపర్ స్టార్. కుదిరితే మరొకసారి మీమ్మల్ని హగ్ చేసుకోవాలి.' అని సోనూసూద్ ట్వీట్ చేశారు.


సోనూసూద్ పెట్టిన పోస్ట్ కి కృతజ్ఞతలు అంటూ కేటీఆర్  రిప్లై ఇచ్చారు. కరోనా టైంలో అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సోనూసూద్ అనేక సహాయ కార్యక్రమాలు చేశారు. తెలుగు ప్రజలు.. సోనూసూద్ ను చాలా అభిమానిస్తారు. అనేక మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో సోనూసూద్ చేయడంతో అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా ఆయనని తన ఇంటికి ఆహ్వానించారు. కలిసి లంచ్ కూడా చేశారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో  సోనూసూద్ తనదైన శైలిలో పోస్ట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 


 






Also Read: KTR Birthday: కేటీఆర్ చిన్నప్పుడు ఇలా ఉన్నారన్న మాట!


               KTR birthday song: అదరగొడుతున్న 'కదిలే కదిలే యువ కెరటం కదిలే' సాంగ్


                 KTR Tweets: ఐటీ మినిస్టర్‌.. సమస్యల పరిష్కారంలో ట్రెండ్ సెట్టర్