TSPSC Papers Leak Case : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్ తో హైకర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.   TSPSC పేపర్ లీకేజ్ కేసు నిందితుడు రాజశేఖర్ సతీమణి సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  కేసును సిబిఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో సుచరిత కోరారు. తన  భర్తపై  పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ... ఇప్పటివరకు జరిపిన విచారణను వీడియోలో చూపించాలని కోరారు. ప్రతివాదులుగా డిజిపి, చీఫ్ సెక్రటరీ ,సిట్ , హైదరాబాద్ సిటీ డిసిపి సెంట్రల్ జోన్లను  సుచరిత పేర్కొన్నారు.  సుచరిత పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.  అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్ట్ ను ఆశ్రయించవచ్ని...సూచించింది. 


పేపర్ లీకేజీ కేసు విచారణ సందర్భంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని  ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.  తదుపరి విచారణను  హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.  మరో వైపు ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు NSUI తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. బల్మూర్ వెంకట్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పేపర్ లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానంగా ఉందని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో చేసిన వాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.


పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇద్దరి పాత్ర మాత్రమే ఉందన్న కేటీఆర్ వాఖ్యలు విచారణను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బల్మూర్ వెంకట్ పిటిషన్‌లో తెలిపారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. కాగా, మార్చి 21న మంగళవారం పిటిషన్ తరపు వాదనలు వినిపించునున్నారు నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రసిడెంట్ వివేక్ ధన్కా. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై మార్చి 21న విచారణ జరుపనుంది.
ఇదే కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అలాగే  నిందితుడు రాజశేఖర్ భార్య పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా వేసింది. 


మరోవైపు  TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితులను మూడో రోజు మరికాసేపట్లో హిమాయత్ నగర్‎లోని సిట్ ఆఫీస్‎లో విచారించారు.  రవీణ్, రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 పరీక్ష పేపర్‎ని లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‎ని ఎవరెవరికి ఇచ్చాడనే యాంగిల్‎లో విచారణ చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారని గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‎లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్‎ను బయటకు తీస్తున్నారు. అక్టోబర్‎లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఎవరెవరితో చాటింగ్ చేశారు..ఎవరెవరితో కాల్స్ మాట్లాడారో లిస్ట్ తీయనుంది. అక్టోబర్‎లో వీరిద్దరి బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పరిశీలించనుంది. గ్రూప్ 1 పేపర్ తీసుకున్న వారిని గుర్తించి..వారిపైన సిట్ కేసులు పెట్టనుంది.