తెలంగాణలో వీఆర్ఏల‌ను క్రమ‌బ‌ద్దీక‌రించాల‌ని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్‌ఏల్లో నీటిపారుదల శాఖకు 5,900 మందిని కేటాయించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన రెవెన్యూ శాఖ ముమ్మురంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్  నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనల మేరకు ఆయా శాఖల్లో వీఆర్ఏల‌ను సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా వివిధ శాఖల్లో ఎంతమేరకు సిబ్బంది అవసరముందన్న అంచనా వేసి, అర్హతల వారీగా వీఆర్‌ఏలను కేటాయిస్తున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖలో 5,900 మందిని సర్దుబాటు చేయనున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ నుంచి ఇప్పటికే లేఖ అందడంతో.. అందుకు సంబంధించిన నియామక పత్రాలను సిద్ధం చేయడంలో అధికారుల నిమగ్నమయ్యారు. వారిని ప్రాజెక్టుల కింద సహాయకులుగా, లస్కర్లుగా నియమించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. 


మిషన్ భగీరథ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకూ కొందరిని కేటాయించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఇతర శాఖలకు వీఆర్‌ఏల బదలాయింపుపై స్పష్టత వచ్చాక ఒకేసారి క్రమబద్ధీకరణ, పేస్కేల్ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. 


ALSO READ:


కాకినాడ జిల్లాలో 719 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా! జులై 21న ఇంటర్వ్యూలు
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, డీఆర్డీఏ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో జులై 21న ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా  పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఉద్యోగ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో మొత్తం 12 ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువతీ, యువకులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీలోని పిఠాపురం, కాకినాడ, అన్నవరం, రాజమండ్రి, ఏలేశ్వరం, కడప,తణుకు, తాడేపల్లిగూడెం, సత్యవేడు, అనంతపురం, పరవాడ, శ్రీ సిటీ, తడ, తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, మంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. 
జాబ్ మేళా పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial