Reservation For BCs in local body elections | హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య (Justice Eshwaraiah) అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యనేతలు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జస్టిస్ వి ఈశ్వరయ్యతో సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల, సమగ్ర కులగణన (Caste Sensus), న్యాయపరమైన అంశాలను చర్చించారు. 


ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే


రిజర్వేషన్ల పెంపు కచ్చితంగా సాధ్యమేనని, అయితే అది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందని జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు. ఎక్కడైనా సరే ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే రిజర్వేషన్ల పెంపు సహా ఇతర అంశాలు అమలు సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫేస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుల గణన (Caste Sensus) చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కల్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. ఆ దిశకు యువతను, రాష్ట్ర ప్రజలను చైతన్య వంతులను చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. 


జస్టిస్ ఈశ్వరయ్యతో భేటీ అయి చర్చించిన వారిలో ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీలు వి గంగాధర్ గౌడ్, కర్నె ప్రభాకర్, సీనియర్ నేత చెరుకు సుధాకర్, మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, డాక్టర్ చిరుమల్ల రాకేశ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, జి నాగేందర్ గౌడ్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, శుభప్రద్ పటేల్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, నోముల భగత్, మాజీ కార్పొరేటర్ అలకుంటృహరి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, కార్యదర్శి మన్నె రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


చాలా రోజుల కిందటే ముగిసిన పంచాయతీల పదవీ కాలం


తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం చాలాకాలం కిందటే ముగిసింది. ఇప్పటికే ఏడు, 8 నెలలు కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే బీసీ కుల గణన చేపట్టి అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా అని చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చాక ఎన్నికల నిర్వహణ చేపడితే ఏ సమస్యా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ చివరి వారంలో, లేకపోతే నవంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.


Also Read: Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు