YouTube Video: గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ భారతదేశం నుంచి అప్‌లోడ్ అయిన 22 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. అలాగే లక్షలాది ఛానెల్‌లను కూడా నిషేధించింది. యూట్యూబ్ అటువంటి చర్య ఎందుకు తీసుకుంది?


నిజానికి యూట్యూబ్ 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుంచి ప్రపంచంలోని అనేక దేశాల నుండి వీడియోలను తీసేసినట్లు ప్రకటించింది. అయితే వీటిలో అత్యధిక సంఖ్యలో ఇండియన్ వీడియోలు ఉన్నాయి.


90 లక్షలకు పైగా వీడియోలు అవుట్...
యూట్యూబ్ మార్గదర్శకాలను పాటించనందుకు ప్రపంచం నలుమూలల నుంచి మొత్తం 90,12,232 వీడియోలను తొలగించింది. వీటిలో 25 శాతం వరకు వీడియోలు భారత్‌కు చెందినవే ఉన్నాయి. యూట్యూబ్ భారతదేశం నుంచి మొత్తం 22,54,902 వీడియోలను తొలగించింది. ఈ జాబితాలో భారతదేశం తర్వాత సింగపూర్ రెండో స్థానంలో ఉంది. సింగపూర్‌కు చెందిన 12,43,871 వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఇవి మాత్రమే కాకుండా యూట్యూబ్ మాతృ దేశం అమెరికా మూడో స్థానంలో ఉంది. అమెరికా నుంచి అప్‌లోడ్ అయిన 7,88,354 వీడియోలను కంపెనీ తొలగించింది.


యూట్యూబ్ షేర్ చేసిన డేటా ప్రకారం ఇందులో 96 శాతం వీడియోలను 'ఆటోమేటిక్ ఫ్లాగింగ్' అనే ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా గుర్తించారు. అంటే ఈ వీడియోలను మనుషులు రివ్యూ చేయలేదు. వీటిని మెషీన్ ద్వారా రివ్యూ చేశారు. ఇవి మాత్రమే కాకుండా యూట్యూబ్ మార్గదర్శకాలను పాటించని సుమారు మూడు లక్షల వీడియోలను ఒక యూజర్ గుర్తించారు. సుమారు 52 లక్షల వీడియోలను యూట్యూబ్ గుర్తించింది. కేవలం నాలుగు వీడియోలను మాత్రమే ప్రభుత్వ సంస్థలు గుర్తించాయి.


తొలగించబడిన వాటిలో 51.15 శాతం వీడియోలు జీరో వ్యూస్‌ను కలిగి ఉన్నాయని, 26.43 శాతం వీడియోలు 0-10 వీక్షణలను కలిగి ఉన్నాయని, కేవలం 1.25 శాతం వీడియోలు మాత్రమే 10,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?


రెండు కోట్లకు పైగా ఛానెల్స్‌పై నిషేధం
యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుంచి ఈ వీడియోలను తొలగించడానికి గల కారణాలను కూడా వివరంగా వెల్లడించింది. యూట్యూబ్ విడుదల చేసిన నివేదికలో 39.4 శాతం వీడియోలు ప్రమాదకరమైనవి లేదా హానికరమైనవిగా గుర్తించారు. 32.4 శాతం వీడియోలను పిల్లల భద్రత సమస్యల కారణంగా తొలగించారు. 7.5 శాతం వీడియోలు హింసాత్మకంగా లేదా అశ్లీలమైనవిగా గుర్తించారు. వీడియోలను తీసివేయడానికి ఇతర కారణాలలో న్యూడిటీ లేదా సెక్సువల్ కంటెంట్, వేధింపులు, బెదిరింపులు, హింస, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి కారణాలు కూడా ఉన్నాయి.


వీడియోలను తీసివేయడమే కాకుండా యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మొత్తం 2,05,92,341 ఛానెల్‌లను కూడా తొలగించారు. వీటిలో 92.8 శాతం ఛానెళ్లను స్పామ్, తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత కంటెంట్ వల్ల తీసేశారు. అదే సమయంలో న్యూడిటీ లేదా సెక్సువల్ కంటెంట్ కారణంగా 4.5 శాతం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 0.9 శాతం ఛానెళ్లు తీసేశారు.


Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?