మీరు ఎంతో శ్రమించి వీడియో తయారు చేసి YouTubeలో అప్‌లోడ్ చేస్తుంటారు. తర్వాత ఆ వీడియోను ఎవరైనా మీ అనుమతి లేకుండా వారి YouTube ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది మీ కాపీరైట్ హక్కులను ఇతరులు దుర్వినియోగం చేయడమే అవుతుంది. కానీ YouTubeలో మీరు చేసిన కంటెంట్‌ను కాపాడేందుకు పూర్తి స్థాయి సిస్టమ్ ఉంది. కనుక యూట్యూబ్‌లో ఎవరైనా మీ వీడియోను అప్‌లోడ్ చేస్తే, దాన్ని ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

కాపీరైట్ అంటే ఏమిటి?

వీడియోలు, మ్యూజిక్, సమాచారం, ఫోటోలు వంటి ఏదైనా సృజనాత్మక కంటెంట్ క్రియేట్ చేసిన వారికి లభించే చట్టపరమైన హక్కును కాపీరైట్ అంటారు. వ్యక్తులు ఎవరైనా, లేదా సంస్థ గానీ అనుమతి లేకుండా ఆ కంటెంట్‌ను ఉపయోగించకూడదు. ఎవరైనా మీ కంటెంట్ ను మీ పర్మిషన్ లేకుండా వాడేస్తే అది కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణిస్తారు. అది చట్టపరమైన చర్యకు దారితీస్తుంది.  

Continues below advertisement

వీడియోను తొలగించడానికి పూర్తి విధానం ఏమిటి?

ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా మీ వీడియోను అప్‌లోడ్ చేస్తే, మీరు YouTube నుండి ఆ వీడియోను తీసివేయాలని అధికారికంగా,  చట్టప్రకారం కోరవచ్చు. YouTube మీకు రెండు చాయిస్‌లు ఇస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే.. ఆన్‌లైన్ వెబ్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి, రెండవది ఇమెయిల్ ద్వారా వీడియోను తొలగించాలని కోరడం. 

వీడియోను తొలగించడానికి వెబ్ ఫారమ్‌ను ఇలా ఫిల్ చేయండి

1. వీడియోను రిమూవ్ చేయడానికి మొదట YouTube స్టూడియోకి వెళ్లి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. 

2. ఆ తర్వాత, ఎడమ మెనూ నుండి కాపీరైట్ విభాగం (Copyright Section)పై క్లిక్ చేయండి. 

3. ఇప్పుడు వీడియోను తొలగించడానికి కొత్త అభ్యర్థన (New Removal Request)పై క్లిక్ చేయండి 

4. ఆ తర్వాత, వెబ్ ఫారంను పూరించండి. మీ పర్మిసన్ లేకుండా అప్‌లోడ్ చేసిన వీడియో లింకును ఫాంలో ఫిల్ చేయాలి, మీ ఒరిజినల్ వీడియో గురించి సమాచారాన్ని ఇవ్వాలి. మీ పేరు, ఈమెయిల్, అడ్రస్ మొదలైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. రెండు చట్టపరమైన ప్రకటనలను యాక్సెస్ట్ చేయండి. చివరగా ఈ వీడియోల కాపీలను YouTubeలో కనిపించకుండా రిస్ట్రిక్షన్ చేసే బాక్స్ సెలక్ట్ చేసుకోండి.  

5. అన్ని వివరాలు ఫిల్ చేసిన తరువాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. 

ఇమెయిల్ ద్వారా వీడియోను ఎలా తొలగించవచ్చు?

మీరు వెబ్ ఫాం ప్రాసెస్ వద్దనుకుంటే, ఈమెయిల్ ద్వారా కూడా మీ రిక్వెస్ట్ పంపవచ్చు. మీరు copyright@youtube.comకి వివరాలు పంపాలి. ఈమెయిల్‌లో మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి మిమ్మల్ని సంప్రదించడానికి కావాల్సిన అన్ని వివరాలను ఇవ్వండి. ఆ తర్వాత, మీరు ఏం క్రియేట్ చేశారు, అది ఎక్కడ అప్‌లోడ్ చేశారో తెలపాలి. మీ కంటెంట్ కాపీ చేసిన వీడియో లింక్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత లీగల్ ప్రకటన చేయాలి. చివరగా చట్టపరంగా (అధికారిక పత్రాల్లో ఉన్న) మీ పేరును కూడా తెలిపాలి. అలాగే, మీరు వీడియోను రిమూవ్ చేయాలని రిక్వెస్ట్ చేసినప్పుడు, భవిష్యత్తులో ఆ వీడియో కాపీని మళ్లీ YouTubeలో అప్‌లోడ్ చేయకుండా ఉండటానికి YouTube మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది.