YouTube New Rules : వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను అప్‌డేట్ చేస్తున్నామని YouTube తెలిపింది. వాస్తవానికి, డిజిటల్ వస్తువులు, NFTల ద్వారా బెట్టింగ్ వంటి కొత్త ట్రెండ్‌లకు దూరంగా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అందుకే తన ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా చేయడానికి కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.

Continues below advertisement

కొత్త నిబంధనలతో ఏమి మారుతుంది?

ప్రస్తుతం, వీక్షకులను Google నుంచి సర్టిఫై చేయని బెట్టింగ్ సైట్‌లకు డైరెక్ట్ చేసే వీడియోలను YouTube నిషేధించింది. నవంబర్ 17 నుంచి, వీడియో గేమ్ స్కిన్‌లు, కాస్మెటిక్స్, NFTల వంటి డిజిటల్ వస్తువుల ద్వారా బెట్టింగ్‌ను ప్రోత్సహించే వీడియోలను కూడా నిషేధిస్తారు. అంటే, గేమ్‌లో ఉన్న బెట్టింగ్‌ను ప్రోత్సహించే లేదా చూపించే క్రియేటర్ల వీడియోలను ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించవచ్చు.

Continues below advertisement

కాసినో-శైలి వీడియోలపై కూడా ఆంక్షలు పెరుగుతాయి

బెట్టింగ్‌తోపాటు, ఇప్పుడు క్యాసినో-శైలి గేమ్‌లకు సంబంధించిన వీడియోలపై కూడా ఆంక్షలు పెరుగుతాయి. వాటిపై వయోపరిమితి విధించబోతోంది. YouTube ప్రకారం, అటువంటి వీడియోలను ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయవచ్చు, కానీ వాటిని 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వీక్షకులు మాత్రమే చూడగలరు. దీనితో పాటు, గ్రాఫిక్ గేమింగ్ కంటెంట్‌పై కూడా ఆంక్షలు విధించనున్నారు. హ్యూమన్ క్యారెక్టలకు వ్యతిరేకంగా హింసను చూపించే వీడియోలపై కూడా వయోపరిమితి విధించవచ్చు.