గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 30 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 30th Episod

Continues below advertisement

సొంతంగా ఇల్లు కట్టుకోవాలని బాలు-మీనా కష్టపడి పనిచేస్తూ పొదుపు చేస్తుంటారు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా అని మీనా అంటే.. కారు డ్రైవ్ చేసి బ్రేక్ తొక్కి తొక్కి కాలు నొప్పి అంటాడు బాలు. ఆగండి అని చెప్పి..వెంటనే వేడినీళ్లు తీసుకొచ్చి బాలుకి సేవలు చేస్తుంది మీనా. అది చూసి మురిసిపోయిన ప్రభావతి.. హమ్మయ్య వీడు దాని బుట్టలో పడడు...ఉదయాన్నే దాని కాళ్లకు నెయిల్ పాలిష్ వేసినా..ఇప్పుడు దాన్ని కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని సేవ చేయించుకుంటున్నాడు. వీడు నా వంశం పరువు నిలబెట్టాడు అనుకుంటుంది. వెళ్లి రవిని పిలుస్తుంది... పెళ్లాంకి సేవచేసే నువ్వు బాలుని చూసి బుద్ధితెచ్చుకో అని క్లాస్ వేస్తుంది. రవిని తీసుకెళ్లి చూపిస్తుంది. అప్పటికి బాలు మీనా చేతులకు వేడినీళ్లతో కాపడం పెడతాడు. సున్నితమైన ఈ చేత్తో ఎన్ని పూలు కడితే వెయ్యి రూపాయలు లాభం వచ్చి ఉంటుందంటాడు. నువ్వే చూడు అమ్మా అని రివర్స్ లో చెప్పిన రవి..భార్యపై ప్రేమ ఉండే ఎవరైనా ఇలానే చేస్తారు అనేసి వెళ్లిపోతాడు.  ఇంతలో సత్యం వచ్చి.. ఏమైందమ్మా అని అడుగుతాడు. కాళ్లు నొప్పి అన్నారు వేడినీళ్లతో కాపడం పెడుతున్నా అంటుంది. ఈరోజు రెస్ట్ తీసుకో.. మీనా వాడి కాళ్లు కట్టేయమ్మా అని చెప్తాడు సత్యం. చేతిలో అదేంటని బాలు అడిగితే బొమ్మ..మీ అమ్మకోసం తీసుకొచ్చాను అంటాడు.  మూడు కోతుల బొమ్మ చూపించి..నీతి చెబుతాడు.. వీటిని రోజూ ఉదయం లేవగానే చూడు..నీకు బుద్ధి వస్తుందని చెబుతాడు. పిల్లల్ని సంసారం చేసుకోనీ వాళ్లమధ్య జోక్యం చేసుకోవద్దని క్లాస్ వేస్తాడు మనోజ్ కంగారుగా వచ్చి..తల్లిని రూమ్ లోకి తీసుకెళ్లి కాళ్లపై పడతాడు. అమ్మా నువ్వే కాపాడాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఏం జరిగిందని అడిగితే.. జరిగినదంతా మొత్తం చెబుతాడు నేను మోసపోయాను..నాలుగు లక్షలు పోయాయి అని చెప్తాడు. మళ్లీ  లక్షలు పోగొట్టావా? మాట్లాడితే బిజినెస్ మెన్ అంటావ్..వ్యాపారంలో లాభాలు తెచ్చేవాడే కానీ ఇలా మింగేసేవాడు కాదు..ఎందుకు చదివావ్? ఆ చదువు ఎందుకు పనికొస్తుంది? నీకన్నా మీనా బెటర్ రూపాయి రూపాయి పోగేస్తోందంటుంది. రోహిణి నన్ను తక్కువగా చూడకూడదు..ఇప్పుడిప్పుడే నాకు గౌరవం ఇస్తోంది ..నువ్వేకాపాడాలి అని కాళ్లు పట్టుకుంటాడు. రోహిణికి నిజం చెప్పు అని ప్రభావతి అంటే.. నిజం చెప్తే ఛీకొట్టి వెళ్లిపోతుందని అంటాడు. నాలుగు లక్షలు కావాలని ప్రాధేయపడతాడు. పోయి గుడిముందు అడుక్కో అని ప్రభావతి క్లాస్ వేస్తుంది. ఇంటి పత్రాలు ఇమ్మని అడిగితే మరోసారి వాటి పేరెత్తితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. నగలు ఇవ్వు అని అడిగితే.. నా దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయని చెబుతుంది. అవే ఇవ్వు  వాటిని తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చి..మళ్లీ విడిపించి ఇచ్చేస్తాను అంటాడు. మీనాకు తెలియకుండా నగలు దొంగిలించాలని ప్లాన్ చేసుకుంటుంది ప్రభావతి.  

ప్రభావతి గదిలోకి వెళ్ళి మీనా నగలు దొంగిలిస్తుంది ప్రభావతి..అప్పుడే సత్యం వస్తాడు..కంగారుపడిన ప్రభావతి.. బ్లౌజ్ కుట్టించుకునేందుకు క్లాత్ కోసం వచ్చాను అంటుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ నీ పని చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడు సత్యం. ప్రభావతి సైలెంట్ గా వెళ్లిపోతుంది.

Continues below advertisement