Ammayi garu Serial Today Episode రూప డల్‌గా ఉంటే రాజు వెళ్లి ఏమైంది అమ్మాయిగారు ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్లు అలా డల్‌గా ఉన్నారు అని అడుగుతాడు. ఈ అమ్మాయిగారు అన్న పేరే పోగొట్టుకున్నట్లు ఉన్నాను రాజు.. ఇంత కాలం నా రాజు నన్ను మాత్రమే అలా పిలుస్తాడు.. నా రాజు పక్కన నన్ను మాత్రమే ఊహించుకునే వాడు నీ పక్కన నన్ను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేను అని అంటుంది. నేను నా పక్కన మిమల్ని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేను ఇదే నిజమైన ప్రేమ రాజు అంటాడు.

Continues below advertisement


కోమలిని బయటకు పంపడానికి  ఓదారి దొరికిందని వాళ్లలాగే ఆలోచించి తప్పు అయినా సరే అశోక్‌ వైపు నుంచి నరుక్కురావాలి.. అశోక్‌తోనే నిజం చెప్పిస్తా అని తన ప్లాన్ రూపకి చెప్తాడు. ఇది జరుగుతుందా అని రూప అంటే కచ్చితంగా జరుగుతుందని రాజు అంటాడు. 


ఆనంద్‌ వెళ్తుంటే రాజు అడ్డుకొని నీ ప్రియురాలు కోసం నీకు చెప్పాలి.. మా అమ్మాయిగారి స్థానంలో పంపించి ఆస్తి మొత్తం కొట్టేయాలి అనుకున్న కోమలి గురించి చెప్పాలి.. ఆ కోమలిని నువ్వే ప్రేమించావా.. తను నిన్ను ప్రేమిస్తుందా.. నీ దగ్గర డబ్బు చూసి నీ వెనక పడింది.. ఇప్పుడు నా దగ్గర డబ్బు చూసి నా వెంట పడుతుంది. చీటికి మాటికి నాతోనే ఉంటుంది అని రాజు చెప్తాడు. నువ్వు చెప్తున్న కోమలి ఎవరో నాకు తెలీదు అని అశోక్ అంటే అయితే ఈ ఉంగరం చూడు గుర్తొస్తుందని రాజు నిశ్చితార్థం ఉంగరం చూపిస్తాడు. 


అశోక్‌ షాక్ అయిపోతాడు. ఈ ఉంగరం కోమలికి లూజ్ అయి పక్కన పెడితే నువ్వు కొట్టేశావా అని అడుగుతాడు. ఇప్పటి వరకు తను తెలీదు అన్నావ్..అయినా ప్రేమించిన అమ్మాయి తప్పు చేసింది అంటే ఎవడూ నమ్మడు అందుకే నీ కోసం ఒక వీడియో అని రాజు కోమలికి తినిపించే వీడియో చూపిస్తాడు. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి చూడు నీ నెంబరు బ్లాక్‌లో ఉంటుంది అని రాజు చెప్తాడు. అశోక్ కాల్ చేస్తే నెంబరు బ్లాక్‌లో ఉంటుంది. కోమలికి నువ్వు అక్కర్లేదు తను డబ్బు మనిషి అని రాజు అంటాడు. 


అశోక్‌ చాలా టెన్షన్ అయిపోతాడు. కంగారుగా అశోక్‌ దీపక్‌కి కాల్ చేస్తాడు. దీపక్‌ కోమలికి ఫోన్ ఇవ్వావా అని అంటాడు. దాంతో దీపక్ నీ కోమలి ఇక్కడ రాజు గాడితో తిరుగుతుంది. వచ్చిన పని కూడా పక్కన పెట్టి రాజుని లైన్‌లో పెట్టే పనిలో ఉంది.. దాని కోసం నాకు కాల్ చేయకు అని దీపక్ అనేస్తాడు. అశోక్‌ బిత్తరపోతాడు. 


బంటీ రాత్రి డల్‌గా కూర్చొని ఉంటే రూప వెళ్లి మాట్లాడుతుంది.  ఎప్పుడూ 8:30కి పడుకునే నేను ఇంకా పడుకోలేదు.. రోజూ నీకు నాన్నకి మధ్యలో పడుకుంటే మీ ఇద్దరూ స్టోరీ చెప్తే కదా నాకు నిద్ర వస్తుంది అని అంటాడు. నాన్న వస్తారులే మనం వెళ్తాం అంటే బంటీ ఒప్పుకోడు.. నాన్న వస్తేనే వెళ్తా అంటాడు. తాతయ్యకి కథ చెప్పమని అంటా అని సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్తాడు. తాతయ్యా నాకు నిద్ర పట్టడం లేదు.. నాన్న రుక్మిణి అమ్మ ఇద్దరూ ఒక్క దగ్గరే ఉంటే నాకు కథ చెప్తారు కానీ నాన్న రూపమ్మ దగ్గర పడుకుంటున్నారు.. నాకు ఆ గదిలో నిద్ర పట్టదు అని అంటాడు. 


సూర్యప్రతాప్‌ బంటీతో మీ అమ్మ రూపే బంటీ నువ్వు ఎందుకు ఆవిడను అర్థం చేసుకోవడం లేదు అంటాడు. ఆవిడ గురించి వదిలేయ్ తాతయ్య నాకు కథలు చెప్పండి అంటాడు బంటీ. నాకు కథలు రావురా.. వెళ్లి మీ అమ్మమ్మకి వెళ్లి అడుగు మీ అమ్మమ్మ బాగా కథలు చెప్తుంది అని అంటాడు. చాటుగా విన్ని రూప చాలా చాలా సంతోషపడుతుంది. బంటీ అమ్మమ్మ దగ్గరకు పరుగులు పెడతాడు.


విరూపాక్షిని సూర్యప్రతాప్‌ గదిలోకే తీసుకొచ్చేస్తాడు. తాతయ్యా నీకు కథలు రావు అని చెప్పావు కదా అందుకే మన ఇద్దరికీ కథలు చెప్పడానికి అమ్మమ్మని తీసుకొచ్చాను అంటాడు. విరూపాక్షి షాక్ అయిపోతుంది. సూర్యప్రతాప్‌ ఏంమాట్లాడడు. అమ్మమ్మా నాకు తాతయ్యకు నువ్వు కథలు చెప్పాలి మేం ఇద్దరం నిద్రపోతాం అని అంటాడు. నాకు కథలు రావు అని విరూపాక్షి అంటే నువ్వు కథలు బాగా చెప్తావు అని తాతయ్య చెప్పారు అని అంటాడు బంటీ. విరూపాక్షి సూర్యప్రతాప్‌ని చూస్తుంది. చెప్పారు కదా తాతయ్య అంటే ఆ అని సూర్యప్రతాప్‌ అంటాడు. విరూపాక్షి నవ్వుతుంది. 


బంటీ బెడ్ మీదకు వెళ్లి అమ్మమ్మని తీసుకెళ్తాడు. ఒక్క కథ చెప్పు అమ్మమ్మా అని సూర్యప్రతాప్‌ బెడ్ మీద విరూపాక్షిని కూర్చొపెడతాడు. ఇక బంటీ తాత అమ్మమ్మని చెరోవైపు పడుకోపెట్టుకొని ఇద్దరి చేతులు పట్టుకొని రోజు అమ్మనాన్న నాకు ఇలా  పట్టుకొని కథ చెప్తారు లేదంటే నాకు నిద్ర పట్టదు నువ్వు ఇలాగే చెప్పు అమ్మమ్మా అంటాడు. రూప దూరంగా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఇలా అమ్మానాన్న చేతులు పట్టుకోలేదు బంటీ పట్టుకున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉండేది అని అనుకుంటుంది. 


విరూపాక్షి బంటీతో అనగనగా ఒక రాణి ఉండేది.. ఆ రాణికి కుటుంబం తప్ప ఏం తెలీదు అలాంటి రాణికి ఓ రాజు కలిశాడు. రాజు పరిచయంతో తన జీవితమే మారిపోయింది అని తన కథ చెప్తుంది.సూర్యప్రతాప్‌ కూడా విరూపాక్షిని చూస్తూ ఉంటాడు. రాజు రాణిని మహారాణిలా చూసుకున్నాడు అని విరూపాక్షి అనగానే సూర్యప్రతాప్‌ వేరే వైపు తిరిగి గతంలోకి వెళ్లిపోతాడు. రాజు,రాణిల ప్రేమకు ప్రతిరూపంలా ఓ గారాల పట్టీ పుట్టింది.. అంతా ఆనందంగా సాగుతున్న మహారాణి జీవితంలోకి ఓ ప్రళయం వచ్చింది అని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ ప్రళయంలో మహారాణి కొట్టుకుపోయింది. రాణి ప్రయత్నాలు ఫలించడం లేదు.. ఆ రాజు కరుణించడం లేదు అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.