Computer Mouse is listening to you: కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్లు Mic-E-Mouse అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీలో సాధారణ కంప్యూటర్ మౌస్ (Computer Mouse) లోపల అమర్చిన సున్నితమైన సెన్సార్లను ఉపయోగించి, దాన్ని ఒక రకమైన సీక్రెట్ మైక్రోఫోన్‌గా మార్చవచ్చు. అంటే, మీరు క్లిక్ చేయడానికి, స్క్రోల్ చేయడానికి ఉపయోగించే అదే మౌస్ కొన్ని కండీషన్లలో మీ వాయిస్‌లను రికార్డ్ చేయగలదు.

Continues below advertisement


ఇది ఎలా పనిచేస్తుంది


పరిశోధకుల ప్రకారం కంప్యూటర్ మౌస్ లో అమర్చిన సెన్సార్లు చిన్న కంపనాలను కూడా గుర్తిస్తాయి. వీటిలో మనుషుల నుంచి వచ్చే ధ్వని కంపనాలు కూడా ఒకటి. సైబర్ అటాక్ చేసే వ్యక్తి మీ సిస్టమ్‌లో మాల్వేర్ వ్యవస్థను క్రియేట్ చేసి.. ఈ కంపన సంకేతాలను సేకరించవచ్చు. డేటా సేకరించిన తర్వాత, శబ్దం నుండి శుభ్రపరచడానికి వీనర్ ఫిల్టర్ వంటి టెక్నికల్ మెథడ్ ఉపయోగిస్తారు. తరువాత AI మోడల్ సహాయంతో పదాలను సాధ్యమైనంత త్వరగానే గుర్తిస్తారు.


ఈ సాంకేతికత ఎంత విజయవంతమైంది?


రీసెర్చర్ల బృందం ప్రకారం, కొన్ని ఫ్రీక్వెన్సీల శబ్దాలతో వారు దాదాపు 61 శాతం ఖచ్చితత్వంతో వాయిస్ లను గుర్తించగలిగారు. సాధారణ పదాలను గుర్తించడం కష్టంగా ఉన్నప్పటికీ.. అంకెలను (Numbers) గుర్తించడం చాలా తేలిక. అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పిన్ నెంబర్స్, ఏటీఎం కార్డ్ నెంబర్, వ్యాలిడిటీ, సీవీవీ, పిన్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నంబర్‌ల వంటి సంఖ్యా సమాచారం తేలికగా గుర్తిస్తుందని. అంటే మన బ్యాంకు, కార్డుల సమాచారం ప్రమాదంలో పడవచ్చు.



దాడి చేయడానికి కండీషన్, పరిమితులు


ఈ సైబర్ దాడి ప్రతి పరిస్థితిలోనూ సాధ్యం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. దీని కోసం అనేక ప్రత్యేక కండీషన్లు అవసరం. మౌస్ చదునైన, శుభ్రమైన ఉపరితలంపై ఉండాలి. మౌస్-మ్యాట్ లేదా డెస్క్ కవర్ మీద ఉన్న కారణంగా సిగ్నల్ చాలా బలహీనంగా మారుతుంది. అలాగే పరిసర వాతావరణం ఎలాంటి శబ్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ శబ్దం ఉంటే సంభాషణను అర్థం చేసుకోవడం కష్టం. ముఖ్యమైన విషయం మీ సిస్టమ్ ఇప్పటికే వైరస్, సైబర్ అటాకర్స్ బారినప్పుడు  మాత్రమే సాధ్యమవుతుంది.


ఇది ఎందుకు కీలకం


చిన్న చిన్న పరికరాలు, సాధారణంగా మనం భద్రతా స్కానింగ్‌లో చూడలేనివి కూడా మన ప్రైవసీకి ముప్పు కలిగిస్తాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. Mic-E-Mouse వంటి సైబర్ దాడిని చేయడం కష్టమైనప్పటికీ, హార్డ్‌వేర్-సెన్సార్లు వాటి నుంచి డేటా లీక్ కాకుండా చూసుకోవాలని రీసెర్చర్ల టీమ్ పేర్కొంది.