అమ‌రావ‌తి: ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు మొట్టమొదటి మొద‌టి పాల‌నా భ‌వ‌నం రెడీ అయింది. CRDA బిల్డింగ్ గా పిలుస్తున్న ఈ భవనాన్ని ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం ఉద‌యం గం.9.54ని.ల‌కు ప్రారంభించనున్నారు. అమరావతి రాజ‌ధానిలో పాల‌నా సౌల‌భ్యం కొరకు అన్ని హెచ్ వో డీలు ఒకే చోట.... ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా స‌రికొత్త హంగుల‌తో ఈ భవనాలని నిర్మించినట్టు మంత్రి నారాయణ కార్యాలయం తెలిపింది.అమ‌రావ‌తికి భూములిచ్చిన‌ రైతుల‌కు ద‌గ్గ‌ర‌గా..... సీఆర్డీఏ ప్ర‌ధాన కార్యాల‌యం ఉండాలనేది తమ ఆలోచన గా మంత్రి నారాయణ తెలిపారు.

Continues below advertisement

భవనం ముందు 'A' అక్షరంతో ఎలివేషన్

రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌తిబింబించేలా భ‌వ‌నం ముందు A అక్ష‌రంతో ఎలివేష‌న్ ఇచ్చారు. ఇదే ఈ బిల్డింగ్ కి ప్రధాన ఆకర్షణ గా మారింది.ఇక‌పై అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌ను ఇక్క‌డి నుంచే ప‌ర్య‌వేక్షిస్తారు.అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు.ఇక్క‌డ ఒక ప్ర‌ధాన భ‌వ‌నంతో పాటు PEB భ‌వ‌నాల నిర్మాణం జ‌రిగింది.

Continues below advertisement

CRDA బిల్డింగ్ వివరాలు ఇవే

ప్ర‌ధాన భ‌వ‌నంమొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7((G+7) భవనం 3 లక్షల 7వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్త‌యింది..ఈ విస్తీర్ణంలో ప్ర‌ధాన భ‌వ‌నం 0.73 ఎకరాలు,గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు,పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు,ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు,ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేసారు.జీ ప్లస్ 7(G+7) లో శాఖ‌ల‌వారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి

గ్రౌండ్ ఫ్లోర్ - 23,814 చ.అ-రిసెప్షన్,పబ్లిక్ ఎక్స్ పీరియన్స్ సెంటర్,రెస్టారెంట్,బ్యాంక్,ఏఐ కమాండ్ సెంటర్ 

ఫస్ట్ ఫ్లోర్ - 30,886 చ.అ - కాన్ఫరెన్స్ హాల్స్

సెకండ్ ఫ్లోర్ - 30,886 చ.అ - సీఆర్డీఏ(CRDA)

థర్డ్ ఫ్లోర్ - 32,096చ.అ. - సీఆర్డీఏ

ఫోర్త్ ఫ్లోర్ - 30,862చ.అ. -మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్

ఐదో ఫ్లోర్ - 32,096చ.అ. - సీఆర్డీఏ(ADCL)

ఆరో ఫ్లోర్ - 32,096చ.అ. -ఏడీసీఎల్

ఏడో ఫ్లోర్ - 32,096చ.అ. - పుర‌పాల‌క శాఖ మంత్రి  చాంబ‌ర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబ‌ర్,పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ,ఏడీసీఎల్

టెర్రస్ PEB - డైనింగ్

ఇవి కాకుండా హెడ్ రూమ్స్ 5,554,చ.అ,ప్రొజెక్షన్ శ్లాబ్స్  3,113చ.అ.,టెర్రస్ PEB స్ట్రక్చర్ 32,062 చ.అడుగులు కలిపి మొత్తం 2,85,561 చ.అడుగుల విస్తీర్ణంలో(బిల్ట‌ప్ ఏరియా)లో  ఈ CRDA బిల్డింగ్ ని నిర్మించారు నిర్మించారు.

ఆఫీస్ ప్రాంగణంలో సంపు,పంప్ రూం 4,029చ.అ., 5014చ.అ.,డ్రైవర్స్ లాంజ్ 752 సెక్యూరిటీ రూం 225,యుటిలిటీ బ్లాక్ 11,745 చ.అడుగులతో కలిపి మొత్తం ఎక్స్టర్నల్ బ్లాక్ 21,765 చ.అడుగులు.

*ఇంటర్నల్ బ్లాక్,ఎక్స్ టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చ.అడుగులతో నిర్మించారు*.

మొత్తం లిఫ్ట్ లు - 7(ఒక్కొక్క‌టి 8 మంది కెపాసిటీ)పార్కింగ్ వ‌స‌తి - 170 ఫోర్ వీల‌ర్,170 టూ వీల‌ర్ వెహిక‌ల్స్. 

ఇక ఈ ప్ర‌ధాన కార్యాల‌యానికి ప‌క్క‌నే మొత్తం 8 ఎక‌రాల్లో(పార్కింగ్ ఏరియాతో క‌లిపి) మ‌రో నాలుగు భ‌వ‌నాలు నిర్మించారు.

PEB (PRE ENGINEERED BUILDING) భవనాల వివరాలు

ఒక్కొక్క భవం 41,500 చ.అ.ల విస్తీర్ణంలో నాలుగు భవనాలు అంటే 1,66,000చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.ఈ భ‌వ‌నంలో మున్సిప‌ల్ శాఖ హెచ్ వోడీ ల‌కు ఈ విధంగా కేటాయించారు.

భవనం -1 - 41,500,చ.అ - టిడ్కో,APUFIDC.

భవనం -2 - 41,500,చ.అ - స్వచ్చాంధ్ర కార్పొరేషన్,రెరా అప్పిలేట్ అథారిటీ,గ్రీనింగ్ కార్పొరేషన్.

భవనం -3 - 41,500,చ.అ - రెరా,టౌన్ ప్లానింగ్(DTCP).

భవనం- 4 - 41,500,చ.అ - మెప్మా కార్యాల‌యం.

అమరావతి నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి

అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభమయ్యాయి.వీటిలో సీఆర్డీఏ నుంచి 12,762.46కోట్ల విలువైన 19 పనులు,ఏడీసీఎల్ నుంచి 36,737.06 కోట్ల విలువైన 60 పనులు మొత్తంగా 49,499.52 కోట్ల విలువైన 79 పనులు జరుగుతున్నవి.మొత్తం 54,693.09 కోట్ల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా....వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి.మరో 7 పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి.మరో 5 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది.ఇవికాకుండా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఏదేమైనా అమరావతిని రాజధాని గా ప్రకటించిన తరువాత తొలిసారి గా ఒక శాశ్వత కార్యాలయం ఏర్పాటు అవుతుండడం ఫై అమరావతి ప్రాంత వాసులు అనందం వ్యక్తం చేస్తున్నారు.