2023 Highest Watched Youtube Videos in India: 2023లో గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో భారతీయులు ఎక్కువగా వీక్షించిన వీడియోల లిస్ట్ వచ్చేసింది.. యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ప్రతి 60 సెకన్లకు 500 గంటల కంటెంట్ అప్‌లోడ్ అవుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి నిమిషం లక్షల మంది వ్యక్తులు వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రతి నిమిషానికి కోట్లాది మంది వేర్వేరు వీడియోలను చూస్తున్నారు. 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధికంగా చూసిన వీడియో చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్. ఈ వీడియోతో ఒకేసారి 8.6 మిలియన్ల మంది వినియోగదారులు లైవ్‌లో కనెక్ట్ అయ్యారు. యూట్యూబ్‌లో ఒకే సమయంలో చాలా మంది వ్యక్తులు కనెక్ట్ అయిన లైవ్‌లో ప్రసార వీడియో ఇదే. ప్రస్తుతం ఈ వీడియోకు 79 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.
భారతీయులు అత్యధికంగా చూసిన రెండో వీడియో "మెన్ ఆన్ మిషన్". ఈ వీడియో భారతదేశంలో ఫన్నీ వీడియోలకు ప్రసిద్ధి చెందిన రౌండ్ టు హెల్ ఛానెల్ నుండి అప్‌లోడ్ అయింది. మూడో స్థానంలో యూపీఎస్సీ - స్టాండ్ అప్ కామెడీ ఫీచరింగ్ అనుభవ్ సింగ్ బస్సీ, నాలుగో స్థానంలో డైలీ వ్లాగర్స్ పేరడీ బై క్యారీమినాటి, ఐదో స్థానంలో సాస్తా బిగ్ బాస్ 2 | పేరడీ ఆశిష్ ఈజ్ చచ్లానీ ఉన్నాయి.
చెక్ మేట్ బై హార్ష్ బెనివాల్, ది వైరల్ ఫీవర్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయిన ‘Sandeep Bhaiya | New Web Series | EP 01 | Mulyankan’, టెక్నో గేమర్స్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయిన I STOLE SUPRA FROM MAFIA HOUSE | GTA 5 GAMEPLAY #151, బీబీ కీ వైన్స్ నుంచి అప్‌లోడ్ అయిన BB Ki Vines | Angry Masterji Part 16 కూడా యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయ్యాయి. పదో స్థానంలో స్టాండప్ కమెడియన్ అభిషేక్ ఉపమన్యు చేసిన హెల్త్ యాంగ్లైటీ ఉంది.
2023లో యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన లైవ్ టెలికాస్ట్‌లు
ఇస్రో చంద్రయాన్ 3: 8.06 మిలియన్లు
బ్రెజిల్ వర్సెస్ దక్షిణ కొరియా: 6.15 మిలియన్లు
బ్రెజిల్ వర్సెస్ క్రొయేషియా: 5.2 మిలియన్లు
వాస్కో వర్సెస్ ఫ్లెమెంగో: 4.8 మిలియన్లు
స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు
మరోవైపు పోకో తన కొత్త బడ్జెట్ ఫోన్ అయిన సీ65ను భారతదేశంలో లాంచ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా కాగా, పోకో సీ65 ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇది మనదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గానూ, టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. మ్యాట్ బ్లాక్, పాస్టల్ బ్లూ రంగుల్లో పోకో సీ65 కొనుగోలు చేయవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!