Samantha Instagram: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ముందంజలో ఉంటారు. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ... సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక క్యూ అండ్ ఏ సెషన్‌తో సమంతకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఎదురైంది.
రెండో పెళ్లి చేసుకోరా...
‘మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా?’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శామ్ ఆన్సర్ ఇస్తూ ‘గణాంకాల ప్రకారం అది మంచి పెట్టుబడి కాదు.’ అని ఫన్నీగా చెప్పారు. దాని పక్కన లాఫ్ ఎమోజీ కూడా యాడ్ చేశారు. దాని కింద ఒక రీసెర్చ్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. దీని ప్రకారం 2023 నాటికి మొదటిసారి వివాహం చేసుకునే వారిలో విడాకుల రేటు ఏకంగా 50 శాతం వరకు ఉందట. రెండో పెళ్లి చేసుకునే వారిలో అది 67 శాతంగానూ, మూడో పెళ్లి చేసుకునే వారిలో 73 శాతంగానూ ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే సమంత ఇప్పుడు ఆ స్టోరీని డిలీట్ చేశారు.
సమంత ఇటీవలే సినిమాల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా మూవీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లక్ష్యం. అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే వేదికగా ఇది నిలవనుంది.’ అని ఈ సందర్బంగా పోస్టులో పేర్కొన్నారు.
అలాగే తన నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తన చిన్నప్పుడు ఇష్టంగా విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు సమంత తెలిపారు.
సోషల్ మీడియా వేదికల్లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న భారతీయ సినీ సెలబ్రిటీల్లో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంటారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ సమంత సొంతం. ఇటీవలే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య 31 మిలియన్లను దాటేసింది. 30 మిలియన్ల మైలురాయిని దాటినప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనందాన్ని వ్యక్తపరిచారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా దేశవ్యాప్తంగా సమంత మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.