ప్రముఖ బ్రాండ్ షావోమి స్మార్ట్ మొబైల్స్ లోనూ, స్మార్ట్ టీవీలతోనూ కూడా బాగా ఆకట్టుకుంటోంది. సరైన స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసే షావోమి... ఇప్పుడు మరో స్మార్ట్ టీవీని విడుదల చేసింది. అది కూడా తక్కువ ధరకే. దాని ధర, స్పెసిఫికేషన్స్ ఎంటో తెలుసుకోండి..


వరుసగా స్మార్ట్​ టీవీలను విడుదల చేస్తూ భారత మార్కెట్​లో విస్తరిస్తోంది షావోమి. తాజాగా 32 ఇంచుల ఒక ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది హెచ్డీ సపోర్ట్ తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గా కూడా పనిచేస్తుంది. ఈ టీవీకి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.


హెచ్​డీ సపోర్ట్​ గల ఈ ఆండ్రాయిడ్​ స్మార్ట్ టీవీ ప్యాచ్‌వాల్ యూఐతో పనిచేస్తుంది. దీనిలో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించారు. Mi LED TV 4C స్మార్ట్ టీవీ భారత మార్కెట్లో రూ.15,999 ధరకు దొరుకుతుంది. Mi.com వెబ్‌సైట్లో సేల్ మొదలైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు వారి క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి రూ .1,000 డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.


Mi LED TV 4C స్మార్ట్​టీవీ 32-అంగుళాల హెచ్​డీ ఎల్​ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఎల్​ఈడీ ప్యానెల్ 60Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీ వ్యూయింగ్​ యాంగిల్​, 8ms రెస్పాన్స్​ టైం కలిగి ఉంటుంది. అద్భుతమైన పిక్చర్​ క్వాలిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్‌ సపోర్ట్​ను అందించారు. Mi TV 4C 64 బిట్ అమోలాజిక్​ కొటెక్స్​​-A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మాలి-450 MP3 GPU చిప్​సెట్​తో వస్తుంది. 1GB ర్యామ్​, 8GB స్టోరేజ్‌ అందించారు. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐపై పనిచేస్తుంది. ఎంఐ క్విక్ వేక్ ఫీచర్ సహాయంతో 5 సెకన్లలోపు టీవీని ఆన్ చేయవచ్చు.


ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే..4.2 వైఫై సపోర్ట్ చేస్తుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటుంది. రెండు యూఎస్బీ సపోర్టు కూడా ఉంటుంది. 3.5 MM జాక్ ఆడియో సాంగ్స్ తో సపోర్ట్ చేస్తుంది.  గూగుల్ అసిస్టెంట్ తో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో రెండు 10 W అద్భుతమైన స్పీకర్లను కలిగి ఉంటుంది.  కొన్ని ప్రముఖ  టీవీ ఛానల్స్ డీఫాల్ట్ గా అమర్చి ఉంటాయి.


Also Read: Petrol-Diesel Price, 8 August: ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ తాజా రేట్లు ఇవే.. అక్కడ మాత్రం స్థిరంగా ధరలు..


               Gold-Silver Price: మరింతగా పతనమైన పసిడి.. వెండి కూడా అదే బాటలో.. తగ్గిన తాజా రేట్లు ఇలా..