హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ షావోమీ భారతదేశంలో తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిలిపివేసినట్లు మీడియా నివేదించింది. కంపెనీ తెలిపిన దాని ప్రకారం తన ప్రధాన వ్యాపార సేవలపై దృష్టి పెట్టడానికి దేశంలో తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని ముగించింది.
"వార్షిక వ్యూహాత్మక అంచనా కార్యాచరణలో భాగంగా 2022 మార్లో Mi ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను మూసివేసాం. మా భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ఈ ప్రక్రియలో మా వినియోగదారులకు మద్దతు ఇస్తున్నాం." అని షావోమీ ఇండియా ప్రతినిధి ABP లైవ్‌తో అన్నారు.
దేశంలో తన ఆర్థిక సేవలను నిలిపివేయడంలో భాగంగా షావోమీ తన స్వంత యాప్ స్టోర్, Mi క్రెడిట్, Mi Pay యాప్‌లను తీసివేసినట్లు టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. 2019లో భారతదేశంలో షావోమీ ప్రారంభించిన Mi Pay, ఆ సంవత్సరంలోనే దేశంలో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను చూసింది. 2019లోనే కంపెనీ Mi క్రెడిట్‌ని ప్రారంభించింది. ఇది వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించే యాప్.
శాంసంగ్ వంటి ప్రత్యర్థి కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య షావోమీ ఇండియా జూన్‌లో ప్రధాన నాయకత్వ మార్పును ప్రకటించింది. ఇది భారతదేశంలో తన వ్యాపారానికి కొత్త జనరల్ మేనేజర్‌గా అనుభవజ్ఞుడైన ఆల్విన్ త్సేని ప్రకటించింది. దాని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా అనూజ్ శర్మను పోకో ఇండియా నుంచి షావోమీ ఇండియాకు తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
పన్ను ఎగవేత, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో కొనసాగుతున్న గొడవల మధ్య షావోమీ ఇండియాలో మేనేజ్‌మెంట్ మార్పును కూడా చేసింది. షావోమీ ఇండియా మాజీ అధికారి మను కుమార్ జైన్ ఏడేళ్ల తర్వాత గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా గ్లోబల్ రోల్‌కి మారారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ మార్కెటింగ్, PRతో సహా షావోమీ అంతర్జాతీయ వ్యూహానికి బాధ్యత వహిస్తున్నాడు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?