Xiaomi HyperOS Update in India: సాధారణంగా షావోమీ, రెడ్‌మీ ఫోన్‌లు ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టంను మార్చబోతోంది. కంపెనీ షావోమీ హైపర్ఓఎస్ పేరుతో కొత్త ఆపరేటింగ్ సిస్టంని విడుదల చేసింది. ఇప్పుడు షావోమీ ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను భారతదేశంలో కూడా విడుదల చేయడం ప్రారంభించింది. దాని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.


షావోమీ భారతదేశంలో హైపర్‌ఓఎస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఫోన్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ను 2024 మార్చి నుంచి తన స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభిస్తుంది. షావోమీ మార్చిలో మొత్తం ఏడు స్మార్ట్‌ఫోన్‌లలో ఈ అప్‌డేట్‌ను విడుదల చేయబోతోంది. వన్‌ప్లస్ గతంలో అందించే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టంను ఆండ్రాయిడ్ బేస్డ్ స్కిన్‌ల్లో బెస్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ షావోమీ హైపర్ ఓఎస్ దాన్ని మించే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందో లేదో చూడాలి.


హైపర్ఓఎస్ అందుబాటులోకి వచ్చిన డివైస్‌లు
షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro)
షావోమీ ప్యాడ్ (Xiaomi Pad)
రెడ్‌మీ 12 (Redmi 12)
రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)
రెడ్‌మీ 12సీ (Redmi 12c)
రెడ్‌మీ 11 ప్రైమ్ (Redmi 11 Prime)
రెడ్‌మీ ప్యాడ్ (Redmi Pad)



2024 మార్చిలో హైపర్ఓఎస్‌ని పొందే డివైస్‌లు
షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro)
రెడ్‌మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G)
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ (Redmi Note 12 Pro 5G)
రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ (Redmi Note 12 Pro+ 5G)
రెడ్‌మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G)
రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G)
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ (Redmi Note 13 Pro+ 5G)


2024 రెండో త్రైమాసికంలో హైపర్ఓఎస్‌ని పొందే ఫోన్లు
షావోమీ 11 అల్ట్రా (Xiaomi 11 Ultra)
షావోమీ 11టీ ప్రో (Xiaomi 11T Pro)
ఎంఐ 11ఎక్స్ (Mi 11X)
షావోమీ 11ఐ (Xiaomi 11i)
షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ (Xiaomi 11i HyperCharge)
షావోమీ 11 లైట్ (Xiaomi 11 Lite)
ఎంఐ 10 (Mi 10)
షావోమీ ప్యాడ్ 5 (Xiaomi Pad 5)
రెడ్‌మీ కే50ఐ (Redmi K50i)
రెడ్‌మీ 13సీ (Redmi 13c)
రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G)
రెడ్‌మీ 12 (Redmi 12)
రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G)
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ (Redmi Note 11 Series)


హైపర్ఓఎస్ ప్రత్యేక ఫీచర్లు
హైపర్ఓఎస్ అనేది షావోమీ లాంచ్ చేసిన తాజా ఆపరేటింగ్ సిస్టమ్. దీనిని కంపెనీ ఐదు అంశాలను ఆధారంగా చేసుకుని నిర్మించింది. సిస్టమ్ లెవల్ ఆప్టిమైజేషన్, ఇంటర్‌కనెక్టివిటీ, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, ఓపెన్ ప్లాట్‌ఫారమ్. హైపర్ఓఎస్... షావోమీ స్వంతంగా అభివృద్ధి చేసిన వెలా సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా షావోమీ సరికొత్త ఎంఐ సాన్స్ ఫాంట్‌ను పరిచయం చేసింది. ఇది 600 కంటే ఎక్కువ భాషలు, 20 రైటింగ్ సిస్టమ్‌లను సపోర్ట్ చేస్తుంది.


ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం సౌకర్యాలను వినియోగదారులందరికీ సులభంగా అందుబాటులో ఉంచడానికి కంపెనీ కొత్త కంట్రోల్ సెంటర్‌ను కూడా సృష్టించింది. దీని కోసం కంపెనీ కొత్త మీడియా ప్లేయర్ విడ్జెట్ టైల్‌ను కూడా పరిచయం చేసింది. షావోమీ సిస్టమ్ లోగోలను రీడిజైన్ చేసింది. ఇది గతంలో కంటే స్పష్టంగా ఉందని కంపెనీ పేర్కొంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?